కేసీఆర్‌తో భేటీ.. ఎందుకో?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాజీ ఎంపీ వివేక్‌ కలుసుకోవడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌ నుండి టీఆర్‌ఎస్‌లోకి వివేక్‌ జంప్‌ అయిన విషయం తెల్సిందే.

 Ex Mp Vivek Meets Cm Kcr-TeluguStop.com

అయితే కొన్ని నెలల గ్యాప్‌లోనే మళ్లీ కాంగ్రెస్‌లోకి వివేక్‌ వెళ్లి పోయాడు.కాంగ్రెస్‌ తరపున ఎంపీగా పోటీ చేసిన వివేక్‌ ఘోరంగా ఓటమి పాలయ్యాడు.

దాంతో తాను మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లి తప్పు చేశానని వివేక్‌ భావిస్తున్నట్లుగా ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

మళ్లీ కేసీఆర్‌తో భేటీ వెనుక మాజీ ఎంపీ వివేక్‌ పెద్ద ప్లానే వేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

వరంగల్‌ పార్లమెంటు సభ్యుడు కడియం శ్రీహరిని రాష్ట్ర క్యాబినెట్‌లోకి తీసుకున్న విషయం తెల్సిందే.దాంతో కడియం శ్రీహరి త్వరలో తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆ స్థాన్నాన్ని మళ్లీ అదే సామాజిక వర్గంకు చెందిన నేతకు ఇవ్వాలని కేసీఆర్‌ భావిస్తున్నాడు.అందుకే కడియం ఖాళీ చేసిన స్థానాన్ని తనకు ఇవ్వాల్సిందిగా వివేక్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి అడిగి ఉండవచ్చు అనే ఊహాగాణాలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వార్తలను వివేక్‌ కొట్టి పారేస్తున్నాడు.ఎన్నికలకు మరింత సమయం ఉన్నందున ఇప్పట్లో వివేక్‌ చేరిక అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube