ఒకాయన ఎన్ ఆర్ ఐ ... మరొకాయన నాన్ లోకల్

వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో అధికార గులాబీ పార్టీ ఓటర్లను ఆకట్టుకోవడానికి బాగానే ప్రచారం చేస్తోంది.ఆ పార్టీకి బీజేపీ అభ్యర్థి దేవయ్య , కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ బకరాల మాదిరిగా దొరికారు.

 Kadiam Criticizes Bjp, Congress Over Candidate Selection-TeluguStop.com

వాళ్ళిద్దరి దుమ్ము దులుపుతోంది గులాబీ పార్టీ.బీజేపీ అభ్యర్థి దేవయ్యను ప్రవాస భారతీయుడిగా అంటే ఎన్ ఆర్ ఐ అని ప్రచారం చేస్తోంది.

కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణను నాన్ లోకల్ అంటూ ప్రచారం చేస్తోంది.గులాబీ పార్టీ అభ్యర్థి మాత్రమె మనోడు అని ఓటర్లకు నూరిపోస్తోంది .ఈ ప్రచారం బాగా ప్రభావం చూపే అవకాశం ఉంది.ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీ హరి తన ప్రచారంలో బీజేపీ , కాంగ్రెస్ అభ్యర్థులు జిల్లా వాళ్ళు కాదని అన్నారు.

దేవయ్య 40 ఏళ్ళ కిందటే అమెరికా వెళ్లిపోయారని చెప్పారు.సర్వే జిల్లాకు చెందిన వాడు కాదని అన్నారు.వీళ్ళలో ఎవరు గెలిచినా జిల్లా సమస్యలు పరిష్కారం కావని చెప్పారు.గులాబీ పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ని గెలిపిస్తేనే జిల్లా బాగుపడుతుందని గట్టిగా చెప్పారు.

ఓటర్లకు నేటివిటీ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దయాకర్ వైపు మొగ్గుతారని అనుకుంటున్నారు.బీజేపీ వారు దేవయ్యను గెలిపిస్తే కేంద్రంలో మంత్రి అవుతారని, కాబట్టి జిల్లాకు కేంద్ర నిధులు వస్తాయని చెబుతున్నారు.

కాంగ్రెస్ వారు ప్రచారం చేసుకోవడానికి కెసీఆర్ వ్యతిరేకత తప్ప మరో అంశం లేదు.కెసీఆర్ పరిపాలన చండాలంగా ఉందని చెప్పి ఓటర్ల విరిగేలా చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube