జాతి రత్నాలు( Jati Ratnalu movie ) సినిమాతో ఒక్కసారిగా స్టార్ దర్శకుడిగా గుర్తింపు సొంతం చేసుకున్న అనుదీప్ ( Anudeep )ఆ వెంటనే తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్( Siva Karthikeyan ) తో ప్రిన్స్ సినిమా( Prince movie ) ను చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు.తెలుగు మరియు తమిళంలో రూపొందిన ప్రిన్స్ చిత్రంతో అనుదీప్ తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకున్నాడు.
ఆ సినిమా హీరో శివ కార్తికేయన్ వరుస విజయాలకు అడ్డుకట్ట వేసింది.
ఏమాత్రం ఆకట్టుకోలేక పోయినా ప్రిన్స్ చిత్రం విడుదలైన తర్వాత అనుదీప్ కనిపించకుండా వెళ్ళాడు పోయాడు.అనుదీప్ దర్శకత్వంలో ఆ మధ్య ఒక సినిమా ప్రారంభం కాబోతుంది అనే వార్తలు వచ్చాయి.కానీ అది కార్యరూపం దాల్చలేదు.
కామెడీ చిత్రాలకు పెట్టింది పేరు అన్నట్లుగా అనుదీప్ రెండు చిత్రాలతోనే పేరు సంపాదించుకున్నాడు.కానీ ఆయనతో ప్రస్తుతం ఏ ఒక్క యంగ్ హీరో కూడా వర్క్ చేసేందుకు గాను సిద్ధంగా లేడు అనే టాక్ వినిపిస్తుంది.
ఈ మధ్య కాలంలో అనుదీప్ ఒకరు ఇద్దరు యంగ్ హీరోలను కలిసేందుకు ప్రయత్నించాడట.వారికి కథ చెప్పాలనుకున్నాడట.కానీ వారు కనీసం టైమ్ కూడా ఇచ్చేందుకు ఓకే చెప్పలేదని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.అనుదీప్ జాతి రత్నాలు సినిమా తర్వాత వరుసగా అవకాశాలు సొంతం చేసుకున్నప్పటికీ కేవలం శివ కార్తికేయన్ తో మాత్రమే సినిమాను మొదలు పెట్టాడు.
ఆ సినిమా నిరాశ పర్చడంతో గతంలో చేద్దామనుకున్నా ఫిలిం మేకర్స్ ఇప్పుడు ఆసక్తి చూపించడం లేదు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అనుదీప్ ప్రస్తుతం ఇతర దర్శకుల సినిమాలకు ఘోస్ట్ రైటర్ గా వ్యవహరిస్తున్నాడట.
కొన్ని సినిమాలకు కామెడీ ట్రాక్ రాస్తూ ఉంటే మరి కొన్ని సినిమాలకు కథలు రాస్తూ కథ చర్చల్లో పాల్గొంటూ ఉన్నాడట.మొత్తానికి జాతి రత్నాలు వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు అనుదీప్ ఇంత త్వరగా ఫేడ్ ఔట్ అవుతాడు అనుకోలేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.