16 ఏళ్ల వయస్సులో శ్రీదేవిని గుర్తుచేస్తున్న జాన్వీ కపూర్

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి అతిలోక సుందరిగా నీరాజనాలు అందుకున్న అందాల భామ

శ్రీదేవి

.సౌత్ ఇండియాతో పాటు ఇండియన్ వైడ్ గా స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న అతిలోక సుందరి శ్రీదేవి అందాన్ని ఎవ్వరూ మరిచిపోలేరు.

 Janhvi Kapoor Looks Like Her Mother Sridevi, Bollywood, Tollywood, Bollywood Bea-TeluguStop.com

ఆమె హీరోయిన్ గా చేసిన మొదటి 16 ఏళ్ల వయస్సు సినిమా సమయంలో ఎలాంటి అందంతో ఉందో చనిపోయే వరకు అదే అందం, ఆకర్షణ కలిగి ఉండటం శ్రీదేవికే సొంతం అని చెప్పాలి.ఆమె మరణం యాదృచ్చికమే అయిన ఇప్పటికి చాలా మంది నమ్మని నిజంగా అది మారిపోయింది.

ఇక శ్రీదేవి వారసురాలిగా ఆమె కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది.

నటిగా ఇప్పటికే ఆకట్టుకుని శ్రీదేవికి తగ్గ వారసురాలు అనిపించుకున్న ఇంకా ఆమె తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉందని విమర్శకులు అనే మాట.శ్రీదేవిలో సంపూర్ణ నటి ఉందని, ఎలాంటి ఎమోషన్ ని అవలీలగా పండించే నైపుణ్యం శ్రీదేవి సొంతం అని అంటూ ఉంటారు.అయితే నటనలో శ్రీదేవిని అందుకోవడానికి జాన్వీ ప్రయత్నం చేస్తున్న అందం, ఆకర్షణలో మాత్రం అప్పుడప్పుడు తల్లిని గుర్తు చేస్తూ ఉంటుంది.

తాజాగా జాన్వీ కపూర్ వెడ్డింగ్ డ్రెస్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఫోటోలని రిట్రో స్టైల్ లో చూసిన నెటిజన్లు 16 ఏళ్ల వయసు సినిమాలో శ్రీదేవిని గుర్తు చేసే విధంగా జాన్వీ లుక్స్ ఉన్నాయని పొగిడేస్తున్నారు.

అలాగే తల్లి అందాన్ని జాన్వీ కపూర్ మరోసారి గుర్తుచేస్తుందని కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube