నాకు ఒక తిక్కుంది కానీ దానికి ఒక లెక్కుంది అని పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ చాలా ఫేమస్.అయితే ఇదే డైలాగ్ ని టాలీవుడ్ లో చాలా మందికి మనం అప్లై చేయొచ్చు.
ఉదాహరణకు రాంగోపాల్ వర్మ… ఈయన కూడా తన తిక్కకు లెక్క లేనట్టుగానే ఎవరితో సంబంధం ఉన్నట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటాడు.ఇక ఇటీవల హీరో జగపతిబాబు సైతం కొన్ని సంచలన కామెంట్స్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే.
మొదటి నుంచి కాస్త భిన్నమైన ధోరణి కలిగిన జగపతిబాబు ఎవరిని పెద్దగా ఇబ్బంది పెట్టడు.అయితే ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశాడు.
అసలు పెళ్లి పైన తనకు నమ్మకం లేదని, తన పెద్ద కూతురు పెళ్లి చేసుకుంటానంటే చేశాను కానీ అది నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేని వ్యవహారం అనేది తేల్చి చెప్పాడు.అంతేకాదురు చిన్న కూతురికి పెళ్లి చేసుకోవద్దని కూడా సలహా ఇచ్చాడట.
ఇక ఓసారి పెద్ద కూతురు వచ్చి తాను పిల్లల్ని వద్దనుకుంటున్నానని చెబితే సంతోషంగా ఓకే చెప్పాడట.ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల జగపతిబాబుకి ఏమైంది అనే ఆలోచనలో పడ్డారు ఆయన అభిమానులు.
ఇదంతా పక్కన పెడితే అసలు ఆయన భార్య లక్ష్మి కూడా జగపతిబాబుకు ఇంతలా సపోర్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది.జగపతిబాబు ఏం చేసినా ఆమె పల్లెతి మాట అనదు.ఏనాడు వ్యతిరేకించింది లేదు జగపతిబాబు భార్య పేరు లక్ష్మి. పెద్దల కుదిర్చిన వివాహమే.తొలినాల్లలో అసలు ఇండస్ట్రీకి రాను అని తల్లికి మాట ఇచ్చి మళ్లీ సినిమాల్లోకి వచ్చాడు జగపతి బాబు.అయినా కూడా కుటుంబం అతనిని స్వాగతించింది.
ఇక పేకాట ఆడి వ్యసనాలతో ఆస్తిని మొత్తం పోగొట్టినా కూడా లక్ష్మీ ఏ రోజు బయటకు వచ్చి ఒక మాట కూడా అనలేదు.
తన భర్తకు చేదోడు వాదోడు గానే ఉంది.సొంత ఇంటిని సైతం కోల్పోయే పరిస్థితి వచ్చిన జగపతిబాబు వ్యవహార శైలి పై ఆమె ఆవేదన వ్యక్తం చేయలేదు.ఇక పిల్లల విషయంలోనూ జగపతిబాబు మనస్తత్వాన్ని ఆమె సమర్థిస్తూ రావడం విశేషం.
అందుకే జగపతిబాబు మరియు లక్ష్మీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉంటారు.ఆమె మీడియాకు అసలు కనిపించదు.
ఒక భార్యగా తను చేయాల్సిన పనిని మాత్రం చేస్తూ వెళ్తుంది.ఆయన ఏం చేసినా ఆవిడకు ఓకే మరి ఇంతలా మన హిందూ భార్యలు భర్తలను సపోర్ట్ చేస్తూ వెళ్తే రానున్న కాలం ఎలా ఉంటుందో ఏమో.