ఒకరు రాజకీయాలలో తండ్రిని ఫాలో అవుతూ.తన తండ్రి పేరుతో మెల్ల మెల్లగా ఎదుగుతూ.
తన తండ్రి హఠాన్మరణంతో ఒక్కసారిగా ఊహించని ప్రజాదరణం పొంది.జస్ట్ వెంట్రుక వాసిలో 2014 లో ఏపీలో అధికారాన్ని కోల్పోయారు.ఇదిలాఉంటే మరొకరు అన్న పెట్టిన పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ ఆ పార్టీ ఓటమి అవ్వగానే అన్నతో విభేదించి బయటకి వచ్చేశారు.2014 ఎలక్షన్స్ లో పార్టీ పెట్టి చంద్రబాబు, బీజేపి లకి సపోర్ట్ చేసి జగన్ కి అధికారం రాకుండా చేశారు.ఇప్పటికే అందరికీ అర్హ్తం అయ్యి ఉంటుంది ఎవరు అనేది అవును ఆ నాయకులు ఎవరో కాదు వైసీపి అధినేత జగన్ ఒకరు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరొకరు.
అయితే మొన్నటి వరకూ బాగానే ఉన్న ఇద్దరు నేతలు ఒక్కసారిగా ఒకరి మీద ఒకరు విమర్శలు ఎక్కుపెట్టుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ ఎప్పుడు మీడియా ముందు మాట్లాడినా సరే చంద్రబాబు కంటే కూడా జగన్ ని ఎక్కువగా టార్గెట్ చేయడం చూస్తుంటే రానున్న ఎన్నికల్లో పవన్ జగన్ ని భారీ గానే డీ కొట్టనున్నాడని అర్థం అవుతోంది.మరో పక్క జగన్ కూడా ఎక్కడా తగ్గడం లేదు పాదయాత్ర మొదలు పెట్టిన తోలి రోజుల్లో పెద్దగా పవన్ కళ్యాణ్ ని పట్టించుకునోని జగన్ ఇప్పుడు పాదయాత్రలో చంద్రబాబు ని ఎంతగా టార్గెట్ చేస్తున్నాడో అంతకంటే ఎక్కువగానే టార్గెట్ చేస్తున్నాడు.
ఎందుకంటే మళ్ళీ గత ఎన్నికల ప్రభావం మళ్ళీ జగన్ పై పడకుండా ఇప్పటి నుంచీ పవన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే పనిలో నిమగ్నమయ్యాడు జగన్.
ఇప్పుడు జగన్ పవన్ ల మధ్య పేలుతున్న మాటల తూటాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
అసలు వీరి ఇరువురి మధ్య ఈ మధ్యకాలంలో ఇంతలా గొడవలు రావడానికి కారణం కేంద్రం.మొదట్లో క్రిందిస్థాయి నేతలు తిట్టుకుంటే ఇప్పుడు ఏకంగా పార్టీ అధినేతలే ఒకరినొకరు తుట్టుకున్తున్నారు…నా తండ్రి ముఖ్యమంత్రి కాదు అంటూ పవన్ జగన్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం ఎంత సంచలనం సృష్టించిందో వేరే చెప్పనవసరం లేదు.
అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచీ మెల్లగా జగన్ ని టార్గెట్ చేస్తూ జగన్ క్రేజ్ ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంటే.జగన్ కూడా అదే బాటలో పవన్ పై విమర్సలని ఎక్కు పెడుతున్నాడు.
అయితే జేఎఫ్ సి పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం కూడా జగన్ టార్గెట్ గానే ఏర్పడింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి.అందుకే అవిస్వాసం సమయంలో కూడా పవన్ జగన్ పై ఒత్తిడి తీసుకురావాలని ఎంతో ప్రయత్నించాడు…మళ్ళీ పవన్ ఎక్కడ 2014 సీన్ రిపీట్ చేస్తాడోననే అందోళనతో జగన్ కూడా తీవ్ర స్థాయిలో పవన్ ని టార్గెట్ చేశాడు.
ఇప్పుడు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉంది.