ఎక్కడైనా సిట్టింగ్ ఎమ్మెల్యే ఇబ్బంది పడుతున్నారంటే.ప్రత్యర్తుల పోరు ఎక్కువగా ఉందని అనుకుంటారు.
ప్రతిపక్షాలకు చెందిన నేతలు వేస్తున్న వ్యూహాలు ఎమ్మెల్యలను ఇబ్బందులు పెడుతున్నాయని భావిస్తారు.సహజంగానే ఇలాంటి పరిస్థితి రాజకీయాల్లో ఉన్నవారికి తరచుగా ఎదురవుతుంది.
కానీ, చిత్రం ఏంటంటే.ఇటు సీఎం జగన్‌కు వచ్చిన పరిస్థితే.
అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మరొక నాయకుడు కూడా ఎదుర్కొంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం సీఎం జగన్ .తన పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.రఘు.
ఎప్పుడు ఎలాంటి విమర్శలు చేస్తాడో.ఎప్పుడు ఏపాట పాడి.
జగన్‌ను ఇరుకున పెడతారో తెలియని పరిస్థితి ఏర్పడింది.
జగన్‌ను ఆయన పాలనను, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను కూడా ఎంపీ రఘు తీవ్రస్థాయిలో ప్రతిపక్షానికంటే కూడా ఎక్కువగా ఏకేస్తున్నారు.
దీనికి అడ్డుకట్ట వేసేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఏ ఒక్కటీ ఇప్పటి వరకు సాకారం కాలేదు.దీంతో జగన్ పరిస్థితి గందరగోళంగా మారింది.ఇక, ఇప్పుడు ఇలాంటి పరిస్తితినే వైసీపీకి చెందిన కర్నూలు ఎమ్మెల్యే ఎదుర్కొంటున్నారు.కర్నూలు నియోజకవర్గం నుంచిగత ఏడాది వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచిన హఫీజ్‌ఖాన్‌కు సొంత పార్టీలోనే సెగలు, పొగలు ఎక్కువయ్యాయి.
ఇక్కడ నుంచి 2014లో గెలిచిన ఎస్వీ మోహన్‌రెడ్డి తర్వాత పార్టీ మారి చంద్రబాబుకు జైకొట్టారు.

అయితే, గత ఏడాది ఎన్నికల్లో ఈ టికెట్‌ను టీజీ భరత్ ఖాయం చేయడంతో ఎస్వీ మళ్లీ సొంత గూటికి వచ్చారు.అయితే, అప్పటికే టికెట్‌ను ఖాన్‌కు ఇచ్చేయడంతో ఎస్వీ మౌనం వహించారు.అప్పటి నుంచి నామినేటెడ్ పదవి అయినా దక్కకపోతుందా? అంటూ ఎదురు చూస్తున్నారు.ఇప్పటి వరకు దీనిపై జగన్నుంచి ఉలుకు పలుకు లేదు.దీంతో నియోజకవర్గంలో అనధికార ఎమ్మెల్యేగా ఎస్వీ చక్రం తిప్పుతున్నారు.అధికారులను సైతం శాసించే పరిస్థితి వచ్చింది.పైగా ఎమ్మెల్యే ఖాన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
స్థానిక మీడియాలో ఆయనపై లీకులు ఇచ్చి వార్తలు రాయిస్తున్నారు.
ఇక, వలంటీర్లనుతనకు చెందిన వారినే నియమించుకున్నారు.
దీంతో తాను ఎమ్మెల్యే అయి కూడా ఏమీ చేయలేక పోతున్నాననే భావన ఖాన్‌లో ఉంది.ఎస్వీ మీద ఆయన ఫిర్యాదు చేసినా.
జగన్ కూడా పట్టించుకోలేదనే ప్రచారం జరుగుతుండడంతో మోహన్‌రెడ్డి దూకుడుకు పగ్గాలు లేకుండా పోతున్నాయని అంటున్నారు.దీంతో జగన్ పరిస్థితి తనకు వచ్చిందని ఖాన్ తల్లడిల్లుతున్నారట.!
.