ISRO JOBS: ఇస్రో లో డిగ్రీ అర్హతతో డ్రీం జాబ్ మీసొంతం.. పూర్తి వివరాలు ఇలా..!

హైదరాబాద్ లోని ఇస్రోకు( ISRO ) సంబంధించిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది.మొత్తం 71 కొలువులను ఈ నోటిఫికేషన్ లో భాగంగా భర్తీ చేయనున్నారు.

 Isro Jobs Complete Details Of Your Dream Job With Degree Qualification In Isro-TeluguStop.com

అయితే ఈ ఉదోగాలను కేవలం ప్రాతిపదికన కింద రిక్రూట్ చేయనున్నారు.ఈ ఉద్యోగాలకి సంబంధించిన దరఖాస్తులు ప్రక్రియ మార్చి 18 న మొదలయింది.

అప్లికేషన్ల గడువు ఏప్రిల్ 4వ తేదీతో ముగిస్తుంది.దరఖాస్తుల ప్రక్రియను https://www.nrsc.gov.in/ వెబ్ సైట్ లో పూర్తి చేయవచ్చు.

ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ముఖ్య వివరాలు చూస్తే.71 ఉద్యోగ ఖాళీల కొరకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NSRC), హైదరాబాద్ రిక్రూట్మెంట్ ప్రకటన ఇచ్చింది.ఈ రిక్రూట్మెంట్ లో రిసెర్చ్ సైంటిస్ట్ – 20, జూనియర్ రిసెర్చ్ ఫెలో 27, ప్రాజెక్ట్ సైంటిస్ట్-I – 06, ప్రాజెక్ట్ సైంటిస్ట్-బి – 04 పోస్టులు, ప్రాజెక్ట్ అసోసియేట్-I 02( Project Associate-I 02 ) , ప్రాజెక్ట్ అసోసియేట్-II – 12 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇక ఈ ఖాళీలను కేవలం తాత్కాలిక ప్రాతిపదికన కింద మాత్రమే రిక్రూట్ చేయనున్నారు.పోస్టులను బట్టి విద్య అర్హతలను పేర్కొన్నారు.పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.

ఈ పోస్టులకొరకు మొదట రాతపరీక్షలను నిర్వహిస్తారు.ఆపై ఇంటర్వూలు కూడా ఉంటాయి.అందులో కొన్నిటికీ పోస్టులకు రాత పరీక్షలు లేకుండా కేవలం షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వూకి పిలుస్తారు.

వీటికి ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తులు అప్లై చేసుకోవాలి.మార్చి 18, 2024 దరఖాస్తులు ప్రారంభం అవ్వగా, 08 ఏప్రిల్ 2024 సాయంత్రం 5 గంటలకు దరఖాస్తులకు సమయం ముగిస్తుంది.

మరిన్ని వివరాల కోసం https://apps.nrsc.gov.in/eRecruitment_NRSC/ సంప్రదించాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube