బాణం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు నారా రోహిత్( Nara rohith )… చంద్రబాబు నాయుడు తమ్ముడి కొడుకు అయిన నారా రోహిత్ మొదటి సినిమా తోనే అందరి అటెన్షన్ ని గ్రాప్ చేశాడు…ఈ బాణం సినిమా విమర్శకుల ప్రశంశలు పొందినప్పటికీ ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అయితే సాధించలేదు అనే చెప్పాలి.అయితే ఈ సినిమా తరువాత డైరెక్టర్ పరుశురాం డైరెక్షన్ లో వచ్చిన సోలో సినిమా( Solo ) సూపర్ సక్సెస్ అయింది.
ఇటు డైరెక్టర్ గా పరుశురాం కి యాక్టర్ గా నారా రోహిత్ కి మంచి హిట్ ఇచ్చిన సినిమా అనే చెప్పాలి.
ఈ హిట్ తరువాత ఆయన చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ లు కావడంతో ఆయన క్రేజ్ తగ్గుతూ వచ్చింది, దానికి తోడు ఆయన రొటీన్ సినిమాలు కాకుండా వెరైటీ గా ఉండే డిఫరెంట్ సినిమాలు తీయడం స్టార్ట్ చేశాడు.అన్ని సినిమాలు కూడా డిఫరెంట్ అటెంప్ట్ అని పేరు తెచ్చుకున్నప్పటికి ఆయనకి కమర్షియల్ సక్సెస్ అయితే ఇవ్వలేకపోయాయి అనే చెప్పాలి…
ఇక ఆయన శ్రీ విష్ణు లాంటి హీరో తో కలిసి కూడా కొన్ని సినిమాల్లో చేసి మంచి పేరు తెచ్చుకున్నారు…శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో వచ్చిన శమంతకమణి సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటించాడు నారా రోహిత్… లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య డైరెక్షన్ లో రౌడీ ఫెలో అనే సినిమాలో నటించాడు.ఈ సినిమాతో హీరో అయిన నారా రోహిత్ కి మంచి పేరు వచ్చింది…ఇక ఇప్పుడు కనక మనం నారా రోహిత్ ని చూస్తే ఆయన సినిమాలు చేయకుండా పొలిటికల్ సైడ్ అంటే వాళ్ల పెదనాన్న అయిన చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) గారి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేస్తూ తిరుగుతున్నట్టు తెలుస్తుంది.ఇక ప్రస్తుతం అందుతున్న సమాచార ప్రకారం నారా రోహిత్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పినట్లు గా తెలుస్తుంది…
.