తమిళ బుల్లితెర నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహాలక్ష్మి ( Mahalakshmi )ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్( Ravindra Chandrasekaran ) ను వివాహం చేసుకున్న తర్వాత మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.ఇలా వీరిద్దరూ రెండవ వివాహం చేసుకొని వార్తల్లో నిలిచారు.
అధిక శరీర కాయం కలిగినటువంటి రవీందర్ చంద్రశేఖరన్ ను ఎంతో అందంగా కుందనపు బొమ్మలా ఉన్నటువంటి మహాలక్ష్మి పెళ్లి చేసుకోవడంతో కేవలం అతని డబ్బు చూసే ఈమె తనని పెళ్లి చేసుకుంది అంటూ పెద్ద ఎత్తున వీరి గురించి విమర్శలు వచ్చాయి.
ఇలా ఈ జంట గురించి తరచూ ఇలాంటి విమర్శలు రావడంతో ఎప్పటికప్పుడు మహాలక్ష్మి ఈ విమర్శలను కొట్టి పారేస్తూ వచ్చారు.అయితే కొన్ని తమిళ న్యూస్ ఛానల్స్ వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారని వార్తలు రాశారు.రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరు కూడా విడాకులు ( Divorce ) తీసుకొని విడిపోతున్నారనీ, విడిపోయారని వార్తలు రావడంతో ఈ వార్తలపై మహాలక్ష్మి స్పందిస్తూ పూర్తిగా ఈ వార్తలను ఖండించారు.
ఇలా సోషల్ మీడియాలో వీరి విడాకులు వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో మహాలక్ష్మి తన భర్తతో కలిసి దిగిన ఒక రొమాంటిక్ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఇలా ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ ఫోటోని షేర్ చేస్తూ నువ్వు ఇలా నా భుజంపై చేయి వేస్తే చాలు ఈ ప్రపంచంలో దేనినైనా సాధించగలనన్న ధైర్యం నాకు ఉంటుంది.నా మనసు నిండా నువ్వే ఉన్నావు అమ్ము ఐ లవ్ యు అంటూ ఈ ఫోటోకి క్యాప్షన్ జోడించారు రవీందర్ చంద్రశేఖరన్ సైతం లవ్ యు అంటూ రిప్లై ఇచ్చారు.ఇలా మహాలక్ష్మి చేసిన ఈ పోస్ట్ చూస్తే వీరిద్దరూ విడిపోయారు అంటూ వచ్చే వార్తలలో నిజం లేదని కేవలం అవన్నీ అవాస్తవాలేననీ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.
ప్రస్తుత మహాలక్ష్మి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.