ఫ్యామిలీ కోసం కాదు గ్రామం కోసం ఐపీఎస్.. ఈ యువకుడి సక్సెస్ స్టోరీ వింటే ఫిదా అవ్వాల్సిందే!

ఎవరైనా ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలను కుటుంబం కోసం సాధించాలని భావిస్తారు.అయితే ఒక యువకుడు మాత్రం కుటుంబం కోసం కాకుండా గ్రామం కోసం ఐపీఎస్ లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్యాన్ని సాధించారు.

 Ips Vaibhav Jindal Inspirational Success Story Details Here Goes Viral In Social-TeluguStop.com

ఛత్తీస్ గడ్ లోని జష్ పూర్ జిల్లా కాన్సబెల్ గ్రామానికి చెందిన వైభవ్ జిందాల్ ( Vaibhav Jindal )జాతీయ స్థాయిలో 253వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ అయ్యారు.సరస్వతీ శిశుమందిర్ లో ఏడో తరగతి వరకు వైభవ్ చదువుకున్నారు.

రాయ్ పూర్ లోని బోర్డింగ్ స్కూల్( Boarding School in Raipur ) నుంచి పదో తరగతి వరకు చదువు పూర్తి చేసిన వైభవ్ 2015 సంవత్సరంలో ఇంటర్ పరీక్షల్లో టాపర్ గా నిలిచారు.ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి వైభవ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

గ్రామం కోసం కష్టపడి గ్రామం కల నెరవేర్చిన వైభవ్ జిందాల్ సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.కెరీర్ విషయంలో గ్రామస్తుల నుంచి సహాయసహకారాలు అందడంతో వైభవ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Telugu School Raipur, Vaibhav Jindal, Vaibhav Zindal-Inspirational Storys

రెండుసార్లు ఆశించిన ఫలితం రాని సమయంలో వైభవ్ కొన్నిరోజుల పాటు కోచింగ్ సెంటర్ లో పని చేశారు.నేను గ్రామాన్ని విడిచిపెట్టిన సమయంలో ఏదో ఒకటి సాధిస్తానని గ్రామం ఎదురుచూసేదని అందుకే గ్రామం కోసం ఐపీఎస్ సాధించానని వైభవ్ చెప్పుకొచ్చారు.పట్టు వదలకుండా ప్రయత్నాలు చేస్తే సక్సెస్ సొంతమవుతుందని వైభవ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Telugu School Raipur, Vaibhav Jindal, Vaibhav Zindal-Inspirational Storys

యువత మొదట లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలని ఉత్సాహంతో కష్టపడితే సక్సెస్ సొంతమవుతుందని వైభవ్ కామెంట్లు చేశారు.రోజుకు 8 నుంచి 10 గంటల పాటు ప్రిపేర్ అవుతూ వైభవ్ ప్రశంసలు అందుకుంటూ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు.వైభవ్ జిందాల్ సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

వైభవ్ మరింత సక్సెస్ సాధించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube