స్టార్ హీరో పవన్ కళ్యాణ్( Hero Pawan Kalyan ) సాధారణంగా తనకు నచ్చిన వాళ్లకు, సన్నిహితులకు తన సినిమాలలో ఛాన్స్ ఇవ్వడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.ఒకప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన ప్రతి సినిమాలో అలీ కచ్చితంగా ఉండేవారు.
అలీకి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రాధాన్యత అంతాఇంతా కాదు.అయితే వేర్వేరు కారణాల వల్ల అలీ వైసీపీలో చేరడంతో పవన్, అలీ మధ్య గ్యాప్ ఏర్పడింది.
ప్రస్తుతం పవన్ సినిమాలలో సైతం అలీ నటించడం లేదనే సంగతి తెలిసిందే.అయితే పవన్ కళ్యాణ్ సినిమాలలో ప్రస్తుతం ఒక నటుడికి మాత్రం వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.
ఆ నటుడు నర్రా శ్రీనివాస్( Narra Srinivas ) కావడం గమనార్హం.నర్రా శ్రీనివాస్ అని పేరు చెబితే చాలామంది గుర్తు పట్టలేరు కానీ ఆయన ఫోటో చూస్తే మాత్రం సులువుగానే గుర్తు పట్టే అవకాశం ఉంటుంది.
పవన్ కు పీఏగా నర్రా శ్రీనివాస్ గతంలో పని చేశారు.నర్రా శ్రీనివాస్ పై అభిమానం ఉండటంతో పాటు అతనిలో అద్భుతంగా యాక్టింగ్ చేసే టాలెంట్ ఉండటంతో పవన్ ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ సినిమాలలో ఛాన్స్ వల్ల నర్రా శ్రీనివాస్ కు ప్రస్తుతం ఇతర హీరోల సినిమాలలో సైతం అవకాశాలు వస్తున్నాయి.నర్రా శ్రీనివాస్ కామెడీ టైమింగ్( Comedy Timing ) కు ఫ్యాన్స్ బాగానే ఉన్నారు.
స్టార్ డైరెక్టర్లు ఛాన్స్ ఇస్తే నటుడిగా నర్రా శ్రీనివాస్ రేంజ్ పెరగడంతో పాటు రెమ్యునరేషన్( Narra Srinivas Remuneration ) కూడా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.ఎక్కువ సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడం కూడా నర్రా శ్రీనివాస్ కు మైనస్ అయింది.
నాకు ఏ పాత్ర ఇచ్చినా చేస్తానని కమెడియన్ అని అనిపించుకోవడం కంటే ఆర్టిస్ట్ అంటే ఇష్టమని నర్రా శ్రీనివాస్ తెలిపారు.పవన్ కు చాలా లాంగ్వేజెస్ పై పట్టు ఉందని నర్రా శ్రీనివాస్ పేర్కొన్నారు.నేను నటుడిగా సక్సెస్ కావడానికి పవన్, హరీష్ శంకర్ గబ్బర్ సింగ్( Gabbar Singh ) లో ఛాన్స్ ఇవ్వడం కారణమని ఆయన తెలిపారు.నాకు యాక్టింగ్ లో సీనియర్ ఎన్టీఆర్ స్పూర్తి అని నర్రా శ్రీనివాస్ పేర్కొన్నారు.