పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా( Tholiprema ) విడుదల అయ్యి పాతికేళ్ళు గడుస్తున్న ఇప్పటికి చాలామందికి ఆ సినిమా అంటే ఎంతో ఇష్టం ఉంటుంది.ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి కూడా చాలా మనసుకు నచ్చిన సినిమా అని అందరూ అంటూ ఉంటారు.
ఈ సినిమాకి డైరెక్టర్ కరుణాకర్.అప్పటి వరకు ప్రేమదేశం సినిమాకి అసిస్టెంట్ గా పని చేసిన అనుభవంతో ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారట.
ఒకరోజు మ్యాగజైన్ లో పవన్ కళ్యాణ్ ఫోటో చూసి నా సినిమాకి ఇతడే హీరో అని అనుకున్నాడట.చాలా కాన్ఫిడెంట్ గా రెడీ చేసుకున్న స్క్రిప్ట్ తో పవన్ కళ్యాణ్ కి స్క్రిప్ట్ వినిపించేందుకు డేట్ కోసం ట్రై చేశాడట.
ఎలాగోలా మొత్తానికి ఆ టైం రానే వచ్చింది. కరుణాకరన్ ( Director Karunakaran )పవన్ కళ్యాణ్ కి తొలిప్రేమ స్క్రిప్ట్ వినిపించడానికి వెళుతున్న టైం లో కారు రిపేర్ వచ్చి చాలా ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చింది అంట.
అప్పటికే ఇంట్లో ఏదో సరదాగా గన్నుతో ప్రాక్టీస్ చేస్తున్నారట పవన్ కళ్యాణ్.అది చూసి భయపడిన కరుణాకరన్ సినిమా కథ నచ్చకపోతే నన్ను కాలుస్తావా అన్నయ్య అంటూ సరదాగా అడిగారట.దాంతో అప్పటి వరకు ఆయన వెయిట్ చేపించాడు అన్న కోపం పోయి కూల్ అయిపోయారట పవన్ కళ్యాణ్.అంతే కాదు తొలి సినిమా కాబట్టి పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు కరుణాకరన్ కి అందించారట.
తన సీన్స్ లేకపోయినా కూడా షూటింగ్ కి వచ్చి తనకు తోచిన సలహాలు ఇచ్చేవారట.ఇక పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి ఆ సినిమాలోని పాటలు అంటే కూడా చాలా ఇష్టమట.
ఒకరోజు అర్ధరాత్రి రెండింటి వరకు కూడా వెయిట్ చేసి ఆ సినిమాలోని పాటలను విని కరుణాకరన్ కి హగ్ ఇచ్చి చాలా బాగా చేశామని చెప్పి వెళ్లారట.
నిజజీవితంలోని సంఘటనలను ఎక్కువగా సినిమాల్లో పెడుతూ ఉంటారు కరుణాకరన్.ఈ సినిమాలో హీరోయిన్ ఎంట్రీ సీన్ ఇప్పటికి ఒక క్లాసిక్ ఎంట్రీ అనుకోవచ్చు దీపావళి రోజు దీపాల వెలుగులో వైట్ డ్రెస్ లో హీరోయిన్ ఆడుకుంటున్న షార్ట్ కరుణాకరన్ నిజజీవితంలో జరిగిందట.చెన్నైలో ఒకరోజు ఏదో పనిమీద వెళ్లినప్పుడు దీపావళి రోజు( Deepavali ) సరిగ్గా అదే రకంగా ఒక అమ్మాయి దీపాల వెలుగులో కనిపించిందట.
దానిని అప్పుడే పేపర్ మీద రాసుకున్నారట.ఆ విషయాన్ని చోట కె నాయుడుతో చెప్పగా దాన్ని అద్భుతంగా షూట్ చేశారట.ఇలా అతను జీవితంలో ఎన్నో సంఘటనలు తన సినిమాలో వాడుతూ వచ్చాడు.ఈ సినిమా తర్వాత కరుణాకర్ టాలీవుడ్ లోనే అందరూ మెచ్చుకునే ఒక మంచి సినిమా తీశాడు అని అనుకున్నారు.