కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు.దేశంలో చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.
75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా అదే గందరగోళ పరిస్థితి ఉందని కేసీఆర్ విమర్శించారు.ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చ జరగాలని తెలిపారు.
దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా రాదన్నారు.నర్సింగ్ కాలేజీల్లోనూ ఒక్కటి కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని పేర్కొన్నారు.
తెలంగాణకు రావాల్సిన విభజన బకాయిలను ఏపీకి బదలాయించారని ఆరోపించారు.ఏడేళ్ల నుంచి అడుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.