అమెరికా ఎన్నికల్లో “20 మంది భారతీయ” అమెరికన్లు

భారతీయులు ఉద్యోగ అవసరార్ధం వలన కానీ మరే ఇతర అవసరాల వలన కానీ విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ తమ చక్కని ప్రతిభ కనబర్చి అక్కడ పాతుకు పోవడం మనవారిలో ఉన్న గొప్ప లక్షణం.అంతేకాదు మన భారతీయతని చాటి చెప్పే కార్యక్రమాలు.

 Indo Americans In America Elections-TeluguStop.com

సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు అయితే తాజాగా కొంతమంది భారత సంతతికి చెందిన కొంతమంది ఈ సారి ఏకంగా అమెరికాలో జరిగే కాంగ్రెస్ ఎన్నికల బరిలో నిలబడుతున్నారట వివరాలలోకి వెళ్తే.


ఈ సారి అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లో ఎప్పుడు లేనట్టుగా రికార్డు స్థాయిలో దాదాపు 20 మంది భారతీయ అమెరికన్లు బరిలో దిగనున్నారు…రానున్న నవంబరులో జరగనున్న ఈ ఎన్నికల కోసం వారంతా కలిసి ఇప్పటివరకు రూ.102 కోట్లకుపైగా నిధులు సమీకరించారు.వారిలో ఏడుగురు రూ.7 కోట్లకుపైగా నిధుల చొప్పున సమకూర్చుకున్నారు.


ఇదిలాఉంటే ఇల్లినాయిస్‌లోని 8వ కాంగ్రెస్‌ జిల్లా నుంచి పోటీ చేయనున్న రాజా కృష్ణమూర్తి (డెమోక్రాట్‌) అత్యధికంగా సుమారు రూ.23 కోట్లు సమీకరించారు…రిపబ్లికన్‌ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్‌ జితేందర్‌ దిగాంకర్‌ ఆయనతో తలపడనున్నారు.కృష్ణమూర్తి ప్రస్తుతం ఇల్లినాయిస్‌ 8వ కాంగ్రెస్‌ జిల్లా నుంచే ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి గమనార్హం.

అయితే ఈ వివరాలని ఫెడరల్‌ ఎన్నికల కమిషన్‌ తాజాగా ఈ వివరాలు వెల్లడించింది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube