అమెరికాలోకి భారతీయుల అక్రమ రవాణా : ఉబెర్ యాప్‌తో తరలింపు , భారత సంతతి వ్యక్తికి జైలు

రైడ్ హెయిలింగ్ యాప్ ఉబెర్‌ను( Uber App ) ఉపయోగించి 800 మందికి పైగా భారతీయ పౌరులను( Indian Citizens ) అమెరికాలోకి అక్రమంగా తరలించినందుకు గాను 49 ఏళ్ల భారత సంతతికి చెందిన వ్యక్తికి న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది.జస్పాల్ గిల్ అలియాస్ రాజిందర్ పాల్ సింగ్( Rajinderpal Singh ) ఈ ఏడాది ఫిబ్రవరిలో నేరాన్ని అంగీకరించాడు.

 Indian-origin Man In America Sentenced To Jail For Smuggling Indians Using Uber-TeluguStop.com

కెనడా నుంచి అంతర్జాతీయ సరిహద్దు ద్వారా వందలాది మంది భారతీయ పౌరులను అమెరికాలోకి ( America ) అక్రమంగా తరలించిన స్మగ్లింగ్ రింగ్‌లో పాల్ కీలక సభ్యుడు.ఇందుకు గాను అతను 5,00,000 డాలర్లకు పైగా వసూలు చేసినట్లు అమెరికా న్యాయ శాఖ పేర్కొంది.

కాలిఫోర్నియాకు చెందిన సింగ్‌కు యూఎస్ డిస్ట్రిక్ట్ 45 నెలల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది.గడిచిన నాలుగేళ్ల కాలంలో రాజిందర్ దాదాపు 800 మందికి పైగా అక్రమ వలసదారులను ఉత్తర సరిహద్దు మీదుగా అమెరికాలోకి తరలించాడు.

సింగ్ లాంటి వ్యక్తుల వల్ల వాషింగ్టన్‌కు భద్రతాపరమైన ప్రమాదం పొంచి వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అక్రమ రవాణా కోసం సింగ్ గ్యాంగ్ ఒక్కొక్కరి నుంచి 70,000 డాలర్ల వరకు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.2018 జూలై నుంచి సింగ్, అతని ముఠా సభ్యులు కెనడా నుంచి చట్టవిరుద్ధంగా సరిహద్దు దాటించి వలసదారులను సియాటెల్ ప్రాంతానికి తరలించడానికి ఉబెర్‌ను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది.

Telugu America, Calinia, Canada, Indian Origin, Jaspal Gill, Sentenced Jail, Ind

జూలై 2018 నుంచి ఏప్రిల్ 2022 మధ్య స్మగ్లింగ్ రింగ్‌తో ముడిపడివున్న 17 ఉబెర్ ఖాతాలు ఒక్కొక్క దానిలో 80,000 డాలర్లకు పైగా ఛార్జీలు కలిగి వున్నట్లు పేర్కొన్నారు.అంతేకాదు.స్మగ్లింగ్ గ్యాంగ్ సభ్యులు అక్రమంగా సంపాదించిన ఆదాయాన్ని దాచుకోవడానికి అధునాతన మార్గాలను ఉపయోగించారు.

దర్యాప్తు సమయంలో కాలిఫోర్నియాలోని సింగ్ ఇంటిలో సోదాలు నిర్వహించి 45,000 నగదు, నకిలీ గుర్తింపు పత్రాలను కనుగొన్నారు.

Telugu America, Calinia, Canada, Indian Origin, Jaspal Gill, Sentenced Jail, Ind

ఇకపోతే.గతేడాది జనవరిలో అమెరికా – కెనడా సరిహద్దుల్లో గడ్డకట్టిన స్థితిలో ఒక చిన్నారి సహా నలుగురు భారతీయులు శవాలుగా తేలిన వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.మృతులను జగదీష్ పటేల్, అతని భార్య వైశాలి పటేల్, వారి పిల్లలు విహంగీ పటేల్, ధార్మిక్ పటేల్‌గా గుర్తించారు.

వీరి మృతదేహాలు విన్నిపెగ్‌కు దక్షిణంగా 100 కిలోమీటర్ల దూరంలో వున్న ఎమర్సన్‌కు తూర్పున మంచు కప్పబడిన పొలంలో కనిపించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube