యూకేలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారత సంతతి విద్యార్ధిని (28) దుర్మరణం పాలైంది.నార్త్ ఇంగ్లాండ్‌లోని లీడ్స్‌లో కారు బస్టాప్‌పైకి దూసుకొచ్చిన ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
మృతురాలిని అథిరా అనిల్ కుమార్ లాలీ కుమారిగా గుర్తించారు.ఈ మేరకు వెస్ట్ యార్క్‌షైర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
స్థానిక లీడ్స్ మలయాళీ అసోసియేషన్ ప్రకారం.అథిరా కేరళకు చెందిన వారు.
ఈమె గత నెలలో లీడ్స్ బెకెట్ యూనివర్సిటీలో అధ్యయనం ప్రారంభించారు.ఘటన జరిగిన ఫిబ్రవరి 22న అథిరా బస్‌స్టాప్‌లో వేచి వుండగా.
ఓ కారు పాదచారులపైకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో అథిరా సహా మరో ఇద్దరు పాదచారులు తీవ్రంగా గాయపడ్డారు.
వీరిలో అథిరా మరణించగా.రెండవ వ్యక్తి (40) ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.
ఇక కారును నిర్లక్ష్యంగా నడిపిన పాతికేళ్ల మహిళపై పోలీసులు పలు అభియోగాలు నమోదు చేశారు.అంతేకాకుండా ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడినందుకు ఆమెను అరెస్ట్ చేశారు.
ఇకపోతే గత నెలలో అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధిని దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.మృతురాలిని జాహ్నవి కందులగా గుర్తించారు.ఈమె స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని. డెక్స్‌టర్ అవెన్యూ నార్త్, థామస్ స్ట్రీట్ సమీపంలో జాహ్నవి నడుచుకుంటూ వెళ్తుండగా.
సౌత్ లేక్ యూనియన్‌లోని సీటెల్ పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది.ఈ ఘటనలో ఆమె తీవ్ర గాయాలపాలైంది.సమాచారం అందుకున్న సీటెల్ ఫైర్ డిపార్ట్‌మెంట్ అనుబంధ మెడికో టీమ్ ఘటనాస్థలికి చేరుకుని చికిత్స ప్రారంభించింది.సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో వెంటనే హార్బర్ వ్యూ మెడికల్ సెంటర్‌కు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ జాహ్నవి ప్రాణాలు కోల్పోయింది.ఈ విషయాన్ని భారత్‌లోని ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు.
ఉన్నత చదువులు చదివి జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటుందని భావించిన కుమార్తె తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో జాహ్నవి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదిలావుండగా.క్రిస్మస్ పర్వదినం సందర్భంగా చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో భారతీయ యువకుడు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.మృతుడిని 26 ఏళ్ల మన్‌ప్రీత్ సింగ్‌గా గుర్తించారు.
పెన్సిల్వేనియా రాష్ట్రం క్లారియన్ టౌన్‌షిప్‌లో పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.మన్‌ప్రీత్ న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో నివసిస్తున్నారు.తన వ్యక్తిగత వాహనంలో డిసెంబర్ 24న ఉదయం 6.30 గంటలకు పెన్సిల్వేనియా వెళ్తున్న సమయంలో క్లారియన్ టౌన్‌షిప్ వద్ద వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో మన్‌ప్రీత్ వాహనం కూడా చిక్కుకోవడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.సహాయక బృందాలు అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ మన్‌ప్రీత్ ప్రాణాలు కోల్పోయాడు.