భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ జార్జ్ చాహల్ తన పూర్వీకుల మూలాలు వున్న పంజాబ్ పర్యటనకు వచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
కెనడాలో పెద్ద సంఖ్యలో భారతీయులు, ప్రత్యేకించి పంజాబీలు పెద్ద సంఖ్యలో వున్నారని అన్నారు.కెనడాలో పంజాబీకి మూడవ అధికారిక భాషగా గుర్తింపు ఇవ్వడం ద్వారా.
పంజాబీ కమ్యూనిటీని గౌరవంచామని చాహల్ పేర్కొన్నారు.ట్రాక్టర్ కంపెనీ వైస్ ఛైర్మన్ అమృత్ సాగర్ మిట్టల్‌తో పాటు చబ్బెవాల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజ్‌కుమార్‌లతో జరిగిన సమావేశంలో చాహల్ పాల్గొన్నారు.
తన పర్యటనలో భాగంగా భారత్-కెనడా భాగస్వామ్య అవకాశాలపై చర్చించనున్నారు చాహల్.అలాగే తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు మిట్టల్‌కు చాహల్ కృతజ్ఞతలు తెలియజేశారు.కెనడా లోయర్ కార్బన్ ఎకానమీకి మారేందుకు నిరంతరం కృషి చేస్తుందని జార్జ్ చాహల్ పేర్కొన్నారు.అలాగే ఈ సవాలును ఎదుర్కొనేందుకు ఇతరులకు సహాయం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
అమృత్ సాగర్ మాట్లాడుతూ.కెనడా వంటి అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థలు ప్రపంచ పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు కృషి చేయాలని కోరారు.
అలాగే భారత్- కెనడాలు బహుపాక్షిక వేదికలపై సన్నిహితంగా పనిచేయాలని మిట్టల్ విజ్ఞప్తి చేశారు.ఇక ఇరుదేశాల్లోని వ్యాపార పరిస్ధితులు , పర్యావరణ సమస్యలపై ఈ సమావేశం చాలా సమాచారం ఇచ్చిందని డాక్టర్ రాజ్ పేర్కొన్నారు.కాగా.జార్జ్ చాహల్ అసలు పేరు.హర్నిర్‌జోద్ చాహల్.అల్బెర్టాలోని కాల్గరీ ప్రావిన్స్‌లో జన్మించారు.
లిబరల్ పార్టీ ఆఫ్ కెనడాకు చెందిన చాహల్.రాజకీయాల్లోకి రాకముందు కాల్గరీ సిటీ కౌన్సిల్‌లో ఐదవ నెంబర్ వార్డ్ కౌన్సెలర్‌గా 2017 నుంచి 2021 వరకు పనిచేశారు.2021 కెనడియన్ ఫెడరల్ ఎన్నికల్లో కాల్గరీ స్కైవ్యూ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
ఇదిలావుండగా.పంజాబ్‌కు చెందిన ప్రవాస భారతీయుల సమస్యలపై సీఎం భగవంత్ మాన్ సర్కార్ దృష్టి సారించిన సంగతి తెలిసిందే.తమ చర్యల వల్ల ఎన్ఆర్ఐలకు త్వరగా న్యాయం జరుగుతుందని పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్‌దీప్ సింగ్ ధాలివాల్ పేర్కొన్నారు.
గత బుధవారం ఛండీగడ్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను ఆయన పరిశీలించారు.అనంతరం కుల్‌దీప్ సింగ్ మాట్లాడుతూ.ఇక్కడ ప్రభుత్వం 10 మంది సిబ్బందిని నియమించిందని, ఇది ప్రతి కేసును విచారించి ఫిర్యాదులను పరిష్కరిస్తోందని మంత్రి తెలిపారు.ఎన్ఆర్ఐలు తమ సమస్యల పరిష్కారం కోసం 9056009884 నెంబర్‌కు ఫోన్ చేయాలని కుల్‌దీప్ సింగ్ విజ్ఞప్తి చేశారు.