“భీమవరం బుల్లోడు” ఇంగ్లాండ్ లో సత్తా చాటాడు..

భారత ఎన్నారైలు విదేశాలలోని విద్యా ,ఉద్యోగ పరంగా ఎంతటి కీర్తిని గడించారో వేరే చెప్పనవసరం లేదు.ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో భారతీయుల కోసం ఎన్నో కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్దపడుతూనే ఉన్నాయి అయితే అమెరికా వంటి అగ్రరాజ్యంలో ఎన్నికల సమయంలో ఎన్నారైలకి ఉద్యోగాలు ఇవ్వను స్థానికులకే ఇస్తామని ఎన్నికల హామీ ని ట్రంప్.

 Indian Nri Wins England Local Elections-TeluguStop.com

ప్రకటించాడంటే భారతీయుల హవా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.అయితే

కేవలం విద్య, ఉద్యోగ పరంగానే కాకుండా దేశ విదేశాలలో జరిగే ఎన్నికలలో సైతం భారతీయులు చక్రం తిప్పుతున్నారు.ఇప్పటికే అమెరికాలో మేయర్స్ గా సేనేటర్స్ గా వివిధ కీలకమైన పదవులలో కొనసాగుతున్నారు అయితే తాజాగా ఇంగ్లండ్‌లోని హాలండ్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికలలో భీమవరం యువకుడు సత్తా చాటాడు.ప్రఖ్యాత రాయల్‌ వార్డు నుంచి అధికార కన్సర్వేటివ్‌ పార్టీ తరఫున ఆరేటి ఉదయ్‌ గెలుపొందారు.

అయితే ఈ ఎన్నికలు ఏప్రిల్‌ ఒకటో తేదీన జరగ్గా.మే నెల నాలుగో తేదీన ఫలితాలు వెల్లడించారు.లేబర్‌పార్టీకి చెందిన కెల్లీపై ఆయన విజయం సాధించారు…స్వదేశానికి చెందిన వ్యక్తి చేతిలో గెలిచి సత్తా చాటాడు.ఇదిలాఉంటే ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి అల్లుడు రిషిశునాక్‌ కేబినెట్‌ మంత్రిగా ఉంటూ ఉదయ్‌ అభ్యర్థిత్వాన్ని బలపరిచినట్లు అతని బంధువులు బుధవారం విలేకరులకు తెలిపారు.

ఈ పదవిలో నాలుగేళ్లపాటు ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube