రూపాయి పతనం కేంద్రానికి పెద్ద చిక్కుని తెచ్చి పెడుతోంది.పెట్రో పెరుగుదల…నిత్యావసర వస్తువుల ఇలా ఒకటి కాదు రెండు కాదు రూపాయి ఇచ్చిన ఎఫెక్ట్ తో కేంద్రం అల్లాడి పోతోంది.
రూపాయికి అసలు చరిత్రలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదు.ఒక్క రూపాయి పతనంతో అంతర్జాతీయ పరిణామాలతో పాటు పెట్రో ధరల పెరుగుదల కూడా దీనికి కారణమవుతోంది.
నేటి ట్రేడింగ్లో రూపాయి మారకం భారీగా నష్టపోయింది.లాస్ట్ సెషన్లో రూపాయి మారకం విలువ 71.73 దగ్గర ముగిసింది…45 పైసలు నష్టపోయి రూ.72.18 పైసల దగ్గర ట్రేడ్ అయిన రూపాయి ఒక దశలో రూ.72.67 దగ్గర జీవనకాల కనిష్ఠాన్ని తాకింది దాంతో కేంద్రంపై ఇంతా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఏమి చేయాలో పాలుపోని కేంద్రం ఇప్పుడు ఎన్నారైలని ప్రసన్నం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.
ఈ పరిస్థితులని నుంచీ బయటపడటానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టింది.డాలర్లపై ఆధారపడ్డ దిగుమతులను తగ్గించుకొనే ప్రయత్నాల్లో పడింది.అయినా సరే రూపాయిని నిలబెట్టడానికి తీసుకుంటున్న చర్యలు ఉపశమనం ఇవ్వడం దాంతో ప్రవాసుల నుంచి పెద్ద ఎత్తున డాలర్లను సేకరించడం ద్వారా రూపాయికి విలువ పెంచాలని కేంద్రం భావిస్తోంది అందులో భాగంగానే ఎన్నారైలకోసం కొత్తపథకాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది.