టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో దేవి శ్రీ ప్రసాద్ ఒకరు.ఈయన కొంతకాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్నాడు.
ఎన్ని సినిమాలు చేసిన దేవి శ్రీ మునుపటి మ్యాజిక్ క్రియేట్ చేయలేక పోయాడు.అయితే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమాతో మాత్రం దేవి శ్రీ ప్రసాద్ సూపర్ హిట్ అందుకున్నాడు.
ఈ సినిమా కోసం దేవి శ్రీ అందించిన మ్యూజిక్ తో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసాడు.కేవలం తెలుగు లోనే కాకుండా పుష్ప మూవీ సాంగ్ హిందీ ప్రేక్షకులను కూడా బాగా అలరించాయి.
దీంతో ఈయన పుష్ప సినిమాతో పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు.రాత్రికి రాత్రే పాన్ ఇండియా స్టార్ అవ్వడంతో ఈయనకు హిందీలో సైతం వరుస అవకాశాలు వచ్చినట్టు అప్పుడు పలు వార్తలు వచ్చాయి.
ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో దేవి శ్రీ ప్రసాద్ కొత్త ప్రయోగానికి సిద్ధం అయ్యాడు.హిందీలో పాప్ సింగర్స్ ఎందరో ఉన్నారు.
కానీ వీరందరిని వెనక్కి నెట్టేందుకు మన తెలుగు టాలెంటెడ్ పర్సన్ బరిలోకి దిగుతున్నాడు.దీంతో ఇప్పుడు అందరిలో ఉచ్చుకత స్టార్ట్ అయ్యింది.
ఇటు తెలుగు, అటు హిందీ లో వరుస సినిమాలతో ప్రెజెంట్ బిజీగా ఉన్న దేవిశ్రీ పుష్ప 2 కోసం కూడా మరోసారి చార్ట్ బస్టర్స్ ను రెడీ చేస్తున్నాడు.
ఇక ఇవి చేస్తూనే ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్ మొదటి హిందీ సింగిల్ ను లాంచ్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు.దీంతో ఈయన ఫ్యాన్స్ తో పాటు అంతా ఆశ్చర్య పోతున్నారు.పుష్ప సినిమాతో ఈయన రేంజ్ మారిపోయింది.
ఈ క్రేజ్ ను ఇలా వాడుకోవడానికి సిద్ధం అవుతున్నాడు.మరి ఈయన ప్రయత్నం సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం.