అమెరికా : మోడీపై అభిమానం చాటుకున్న ఎన్ఆర్ఐలు .. ఏకంగా 250 అడుగుల బ్యానర్‌‌తో గ్రాండ్ వెల్‌కమ్

నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) అమెరికాలో ల్యాండ్ అయ్యారు.ఈ సందర్భంగా ఆయనకు అగ్రరాజ్యంలో గ్రాండ్ వెల్‌కమ్ దక్కింది.

 Indian Federation Flies 250-feet Long Banner In New York To Welcome Pm Narendra-TeluguStop.com

అమెరికా అధికారులు, ప్రవాస భారతీయులు మోడీకి స్వాగతం పలికారు.అయితే ఎన్ఆర్ఐల కోసం పనిచేస్తున్న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (ఎఫ్ఐఏ)( Federation Of Indian Association ) సంస్థ మోడీపై అభిమానాన్ని ఘనంగా చాటుకుంది.

న్యూయార్క్‌లోని( New York ) హడ్సన్ నదిపై 250 అడుగులు పొడవైన బ్యానర్‌ను ఎగురవేసి ప్రధానికి ఘన స్వాగతం పలికింది.దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ బ్యానర్‌పై మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోటోలు వున్నాయి.అలాగే “Historic state visit to the USA” అనే క్యాప్షన్ రాశారు.

Telugu Feet Long, Elon Musk, Indian, Historic Usa, Modi America, York, Joe Biden

మరోవైపు నాలుగు రోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీకి తొలి రోజు న్యూయార్క్‌లోని హోటల్ లోట్టే వద్ద ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు.ఆయన రాకకోసం నిరీక్షిస్తున్న ఎన్ఆర్ఐ సమూహం.ఒక్కసారిగా మోడీని చూడగానే ‘‘మోడీ మోడీ’’ అంటూ నినాదాలు చేయడంతో పాటు ఆయనతో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు.ఇక అమెరికా పర్యటనలో భాగంగా తొలి రోజు ఆ దేశానికి చెందిన నేతలు, సీఈవోలు, నిపుణులతో భేటీ అయ్యారు.

వీరిలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అమెరికన్ ఇన్వెస్టర్ రే డైలో, ఆర్ధికవేత్త పాల్ రోమర్‌ తదితరులు వున్నారు.అనంతరం ఐక్య రాజ్య సమితి కార్యాలయంలో ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో మోడీ పాల్గొన్నారు.

Telugu Feet Long, Elon Musk, Indian, Historic Usa, Modi America, York, Joe Biden

గురువారం వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ , ప్రథమ మహిళ జిల్ బైడెన్‌లు మోడీకి స్వాగతం పలకనున్నారు.ద్వైపాక్షిక చర్చల అనంతరం సాయంత్రం మోడీ గౌరవార్ధం స్టేట్ డిన్నర్‌ను ఏర్పాటు చేశారు బైడెన్.రేపు అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు.జూన్ 23న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌లు సంయుక్తంగా విందు ఇవ్వనున్నారు.

ఆ రోజున కూడా అమెరికన్ సీఈవోలు, నిపుణులతోనూ మోడీ చర్చలు జరపనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube