టర్కీ(తుర్కియే)లో భారీ భూకంపాల కారణంగా మూడు రోజుల పాటు శిథిలాల కింద చిక్కుకున్న 6 ఏళ్ల బాలికను కాపాడడంలో భారతీయ కుక్కలు ప్రధాన పాత్ర పోషించాయి.నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) డాగ్ స్క్వాడ్‌లో భాగమైన రోమియో, జూలీ అనే భారతీయ స్నిఫర్ డాగ్‌లు బాలికను కనుగొనడంలో కీలక పాత్ర పోషించాయి.
జూలీ ఆమెను గుర్తించిన మొదటి శునకం.రోమియో బాలిక లొకేషన్‌ను ఎగ్జక్ట్‌గా కనిపెట్టింది.
ఇలా రోమియో, జూలీ మాత్రమే కాదు హనీ అండ్ రాంబో కూడా భూకంప బాధిత తుర్కియేలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
ఘోరమైన భూకంపం తర్వాత తుర్కియేతో పాటు సిరియాకు సహాయం చేయడానికి భారతదేశం ఆపరేషన్ దోస్త్ ప్రారంభించింది. ఈ మిషన్‌లో భాగంగా, జూలీ, రోమియో, హనీ, రాంబో అనే నాలుగు భారతీయ రెస్క్యూ డాగ్‌లను స్థానిక రెస్క్యూ టీమ్‌లకు సహాయం చేయడానికి టర్కీకి పంపారు.ఈ కుక్కలు శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తులను కనుగొనడంలో చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తున్నాయి.
ఇవి ఇప్పటికే చాలా మంది ప్రాణాలను రక్షించాయి.మెక్సికో కూడా 16 మంది సభ్యులతో కూడిన డాగ్ స్క్వాడ్‌ను సహాయక చర్యలకు పంపింది.
రెస్క్యూ ఆపరేషన్‌లలో డాగ్ స్క్వాడ్ ఎంతో సహాయకారిగా మారిందని తుర్కియేలోని ఎన్‌ఆర్‌డీఎఫ్ బృందం కంటింజెంట్ కమాండర్ గుర్మీందర్ సింగ్ చెప్పారు.జూలీ అనే ఆడ కుక్క బతికి ఉన్న బాధితులను గుర్తించి, విలువైన ప్రాణాలను రక్షించడంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌కి సహాయపడిందని కూడా అతను చెప్పాడు.దీని గురించి తెలుసుకున్న ఇండియన్స్ గర్వంగా ఫీల్ అవుతున్నారు.భారతీయలే కాదు భారత శునకాలు కూడా విదేశియుల ప్రాణాలు కాపాడతాయని, మేర భారత్ మహాన్ అని ప్రౌడ్ గా కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే తుర్కియేలో భూకంపం చాలా విధ్వంసం సృష్టించింది.దీనివల్ల చాలా మంది తప్పిపోయారు.అలానే చాలామంది కూలిపోయిన భవనాల కింద చిక్కుకున్నారు.వేలాది ముంది కన్నుమూసారు.