స్పెల్‌బీ లో ఇండియన్ అమెరికన్ రికార్డు

అమెరికాలో భారత సంతతి వాళ్ళ ప్రతిభ చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది.మన వాళ్ళు ఎక్కడో పరాయి దేశంలో సైతం తమ ప్రతిభని చాటుతూ ఎంతో ఉనతమైన స్థానాలకి వెళ్తున్నారు అంటూ తెగ సంబర పడిపోతాం.అమెరికాలో స్థిరపడిన ఎంతో మంది అమెరికా గడ్డపై ఎన్నో రికార్డులని తిరగరాశారు వాటిలో ముఖ్యంగా విద్యార్ధుల ప్రతిభని వెలికి తీసే స్పెల్ బీ కార్యక్రమం ఒకటి

 Indian American Record Inspel B-TeluguStop.com

ఈ ప్రతిష్ఠాత్మక పోటీలో విజేతగా ఇండియన్ అమెరికన్ బాలుడు విజేతగా నిలిచాడు.అమెరికాలో ప్రతిష్ఠాత్మక స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ టైటిల్ భారతీయ అమెరికన్ బాలుడు కార్తిక్ నెమ్మాని(14)ని వరించింది.కోయినోనియా స్పెల్లింగ్‌ను సరిగ్గా ఉచ్ఛరించడం ద్వారా కార్తిక్ ఈ పోటీలో ఘన విజయం సాధించాడు.ఈ ఫోటీలలో ఎంతో మంది పోటీ పడగా చివరికి విజేతగా కార్తిక్ ఎన్నికవ్వడం విశేషం.

అయితే ఈ పోటీలలో మరో విశేషం ఏమిటంటే ఈ పోటీలలో కార్తిక్ కి పోటీగా చివరి వరకూ వచ్చిన విద్యార్ధి కూడా ఇండియన్ అమెరికనే కావడం విశేషం భారతీయ అమెరికన్ విద్యార్థి నాయిసా మోదీతో అనేక రౌండ్లలో పోటీపడిన కార్తిక్ చివరికి విజయం సాధించాడు.కార్తిక్ టెక్సాస్‌లోని మెక్‌కెన్నీలో 8వ తరగతి చదువుతున్నాడు.

టైటిల్ విజేతగా నిలిచిన కార్తిక్‌కు స్క్రిప్స్ బీ సంస్థ ట్రోఫీతోపాటు 40 వేల డాలర్ల నగదును అందజేసింది.మరొక సంస్థ 2500 డాలర్లు ఇవ్వడమే కాకుండా న్యూయార్క్ ,హాలివుడ్ వెళ్ళడానికి టిక్కెట్లు ఇచ్చింది.

అయితే ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే.గడిచిన 11 ఏళ్లుగా ఈ రికార్డు భారతీయ సంతతి వ్యక్తులు గెలుపొందటం అమెరికన్స్ ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube