అమెరికాని అవపోసన పట్టిన వ్యక్తి.భారత్ అంటే ఎంతో ఇష్టత చూప్పించే నేత.
అమెరికా రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ప్రజల మనిషి జాన్ మెక్కెయిన్ చనిపోయారు.అరిజోనా రాష్ట్రం నుంచీ ఆరోసారి సెనేటర్ గా ఎన్నికయిన ఆయన అమెరికా రాజకీయ చరిత్రలో చెదిరిపోని స్థానాన్ని సంపాదించుకున్నారు.
రాజకీయాల్లో మెక్కెయిన్ కి ఎదురు లేదు ఎంతో సమర్దవంతమైన నేతగా పేరు ఉన్న మెక్కెయిన్ మరణం అమెరికా కి తీరని లోటుగా అభివర్ణిస్తున్నారు.
గత కొంత కాలంగా గ్లియోబ్లాస్టోమా అనే బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఈ ఏడాదికి 81 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు…గడిచిన సంవత్సర కాలంగా కీమోథెరపీ చికిత్స చేయించుకుంటున్నారు…అమెరికా రాజకీయ చిత్రపటంలో గొప్ప రాజనీతిజ్ఞునిగా పేరుపొందారు…అంతేకాదు మెక్కెయిన్ వియత్నాం యుద్ధ వీరునిగా ఎంతో ధైర్య శాలిగా ఎంతో గుర్తింపు కూడా ఉంది అయితే.మెక్కెయిన్ చివరిగా కోరిన కోరిక విని అమెరికా ప్రజలు షాక్ తిన్నారు ఇంతకీ ఆయన ఏమి కోరాడో తెలుసా.
ముందు నుంచీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించే మెక్కెయిన్ ఆయన భావజాలాన్ని కూడా ఇష్టపడలేదు.అమెరికా అధ్యక్షుడు అయ్యాక ట్రంప్ పెడుతున్న ఆంక్షలకి ఆయన విసిగిపోయాడు.అందుకే ట్రంప్ సొంత పార్టీకి చెందిన వ్యక్తే అయినా మెక్కెయిన్ ట్రంప్ ని తీవ్రంగా వ్యతిరేకించారు…చివరిగా నాకోరిక ఒకటే నా అంత్యక్రియలకు అధ్యక్షుడు ట్రంప్‌ను ఆహ్వానించొద్దని అంటూ ఆయన తెలిపినట్టుగా చెప్తున్నాయి వార్తా కధనాలు.