ప్రియురాలిని హత్య చేసిన కేసులో నేరాన్ని అంగీకరించాడు భారత సంతతికి చెందిన యువకుడు.వివరాల్లోకి వెళితే.
తారిక్‌జోత్ సింగ్ తన ప్రియురాలు జస్మీన్ కౌర్‌ను ఆస్ట్రేలియాలో కిడ్నాప్ చేసి ఆపై దారుణంగా హతమార్చాడు.అనంతరం ఆమె మృతదేహాన్ని అడిలైడ్‌కు 430 కిలోమీటర్ల దూరంలో వున్న ఫ్లిండర్స్ రేంజ్‌లో సమాధి చేశాడు.
ఈ కేసుకు సంబంధించి గతంలో తారిక్‌ను కోర్ట్ నిర్దోషిగా ప్రకటించింది.అయితే మళ్లీ విచారణకు రావాల్సిందిగా పిలవడం అందరినీ షాక్‌కు గురిచేసింది.
మంగళవారం కోర్ట్ ఎదుట హాజరైన తారిక్‌జోత్ సింగ్.తనను తాను దోషిగా అంగీకరించాడు.
ఈ కేసు విచారణ తిరిగి ఏప్రిల్ నెలలో జరగనుంది.అప్పుడే అతనికి కోర్ట్ శిక్షను విధించనుంది.
దక్షిణ ఆస్ట్రేలియాలో హత్యా నేరాలకు ఖచ్చితంగా 20 సంవత్సరాల జైలు శిక్ష తప్పదు.
పోలీసులు కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం.హత్య జరిగిన రోజు రాత్రి పది గంటలకు నార్త్ ప్లింప్టన్‌లోని సదరన్ క్రాస్ హోమ్స్‌లో తన షిఫ్ట్ ముగించుకున్న జస్మీన్ కౌర్‌ను నిందితుడు బలవంతంగా తీసుకెళ్లాడు.తన కుమార్తెను ఆస్ట్రేలియాకు పంపేందుకు తాను అంగీకరించినందుకు ప్రతిరోజూ చింతిస్తున్నానని జస్మీన్ కౌర్ తల్లి రష్‌పాల్ గత్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
జస్మీన్ కౌర్ అడిలైడ్‌లో తన బంధువులతో పాటు వుంటూ నర్సింగ్ చదువుతోంది.తర్వాతి రోజు జస్మీన్ కౌర్ విధులకు హాజరుకాకపోవడంతో ఆమె యజమాని కుటుంబాన్ని ప్రశ్నించగా.విషయం వెలుగులోకి వచ్చింది.
ఇకపోతే.ఆస్ట్రేలియన్ పౌరురాలిని దారుణంగా చంపిన కేసులో మోస్ట్ వాంటెడ్‌గా వున్న భారతీయుడిని గతేడాది నవంబర్‌లో ఢిల్లీ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.పంజాబ్‌లోని బటర్ కలాన్‌కు చెందిన రాజ్వీందర్ సింగ్ ఆస్ట్రేలియాలోని ఇన్నిస్ ఫైల్‌లో నివసిస్తూ, అక్కడే నర్సుగా పనిచేస్తున్నాడు.
ఈ క్రమంలో 2018లో క్వీన్స్‌లాండ్‌లోని వంగెట్టి బీచ్‌లో తోయా కార్డింగ్లీ అనే యువతిని దారుణంగా హతమార్చాడు.ఈ ఘటన బీచ్ మర్డర్ పేరిట ఆస్ట్రేలియాలో సంచలనం సృష్టించింది.
రంగంలోకి దిగిన పోలీసులకు దర్యాప్తులో హత్య చేసింది రాజ్వీందరేనని తేల్చారు.అయితే అప్పటికే నిందితుడు తన భార్య, ముగ్గురు పిల్లలను అక్కడే వదిలేసి భారత్‌కు పారిపోయి వచ్చాడు.