ఏపీలో జనసేన వరుసగా కీలక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ షెడ్యూల్ ను పార్టీ ప్రకటించింది.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 11 నుంచి 14 వరకు రాజకీయ సమావేశాలు నిర్వహించనున్నారు.ఈ మేరకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించే పలు కార్యక్రమాలకు పవన్ కల్యాణ్ హాజరు అవుతారని తెలిపారు.
అదేవిధంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలుస్తోంది.