పదో తరగతిలో ఫెయిల్.. ఇప్పుడు ఐఎఫ్ఎస్ ఆఫీసర్.. ఈ యువతి సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!

సాధారణంగా పదో తరగతిలో ఫెయిల్ అయిన వాళ్లు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గా( IFS Officer ) ఎంపిక కావడం సులువుగా జరగదు.చిన్న వయస్సులోనే ఇషితా భాటియాకు( Ishita Bhatia ) ఫెయిల్యూర్ ఎదురైంది.

 Ifs Ishita Bhatia Inspirational Success Story Details, Ifs Ishita Bhatia, Inspir-TeluguStop.com

పదో తరగతి ఫెయిల్యూర్ తర్వాత ఆమెకు మరికొన్ని పరీక్షల్లో సైతం ఎదురుదెబ్బలు తగిలాయి.చదువుకు సంబంధించిన పరీక్షలు పాసైనా పోటీ పరీక్షలలో సత్తా చాటే విషయంలో మాత్రం ఆమె ఫెయిల్ అయ్యారు.

అయితే ఎన్నోసార్లు ప్రయత్నించి ఇషితా భాటియా చివరకు ఐ.ఎఫ్.ఎస్ అధికారిగా ఎంపికై ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.ఇషితా భాటియా స్వస్థలం హిమాచల్ ప్రదేశ్ లోని( Himachal Pradesh ) హమార్ పూర్ కాగా నేషనల్ ఇంజనీరింగ్ ఆఫ్ టెక్నాలజీలో ఈసీఈలో చేరి బీటెక్ పూర్తి చేశారు.

ఆ తర్వాత ఢిల్లీలోని ఒక స్కూల్ లో ఆమె జాబ్ లో చేరారు.సివిల్స్ ( Civils ) సాధించాలనే లక్ష్యంతో ఆమె మూడుసార్లు పరీక్షలు రాసినా ఆశించిన ఫలితం రాలేదు.

Telugu Civils Ranker, Ifs Ishita, Ifs, Indian Forest, Ishita, Tenth Ifs, Upsc Pr

మరోవైపు ఆర్బీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో పరీక్షలు రాసినా ఆ పరీక్షలలో ఇషితా భాటియాకు అనుకూలంగా ఫలితాలు రాలేదు.వైఫల్యం మనలో పట్టుదలను పెంచుతుందనే నమ్మకంతో ఆమె ఎన్నో పోటీ పరీక్షలు రాశారు.2021లో ఆమె యూపీఎస్సీ ప్రిలిమ్స్( UPSC Prelims ) పాస్ అయ్యారు.టెలీగ్రాం గ్రూప్స్ సహాయంతో సందేహాలను నివృత్తి చేసుకుని చివరకు మెయిన్స్ కూడా పాస్ అయ్యారు.

Telugu Civils Ranker, Ifs Ishita, Ifs, Indian Forest, Ishita, Tenth Ifs, Upsc Pr

జీవితం చాలా చిన్నదని ఇందులో మనకు మనమే స్పూర్తి కావాలని వైఫల్యాలను పాఠాలుగా తీసుకుంటే మనలో దాగున్న శక్తి బయటికొస్తుందని ఇషితా భాటియా చెప్పుకొచ్చారు.నేను ఫెయిల్ అయినప్పుడల్లా నాకంటే ఎక్కువగా పేరెంట్స్ బాధ పడేవారని ఆమె తెలిపారు.ఫెయిల్ అయిన ప్రతిసారి పట్టుదలతో ప్రయత్నించానని ఇషితా భాటియా కామెంట్లు చేశారు.ఇషితా భాటియా వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube