పదో తరగతిలో ఫెయిల్.. ఇప్పుడు ఐఎఫ్ఎస్ ఆఫీసర్.. ఈ యువతి సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!
TeluguStop.com
సాధారణంగా పదో తరగతిలో ఫెయిల్ అయిన వాళ్లు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గా( IFS Officer ) ఎంపిక కావడం సులువుగా జరగదు.
చిన్న వయస్సులోనే ఇషితా భాటియాకు( Ishita Bhatia ) ఫెయిల్యూర్ ఎదురైంది.పదో తరగతి ఫెయిల్యూర్ తర్వాత ఆమెకు మరికొన్ని పరీక్షల్లో సైతం ఎదురుదెబ్బలు తగిలాయి.
చదువుకు సంబంధించిన పరీక్షలు పాసైనా పోటీ పరీక్షలలో సత్తా చాటే విషయంలో మాత్రం ఆమె ఫెయిల్ అయ్యారు.
అయితే ఎన్నోసార్లు ప్రయత్నించి ఇషితా భాటియా చివరకు ఐ.ఎఫ్.
ఎస్ అధికారిగా ఎంపికై ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.ఇషితా భాటియా స్వస్థలం హిమాచల్ ప్రదేశ్ లోని( Himachal Pradesh ) హమార్ పూర్ కాగా నేషనల్ ఇంజనీరింగ్ ఆఫ్ టెక్నాలజీలో ఈసీఈలో చేరి బీటెక్ పూర్తి చేశారు.
ఆ తర్వాత ఢిల్లీలోని ఒక స్కూల్ లో ఆమె జాబ్ లో చేరారు.
సివిల్స్ ( Civils ) సాధించాలనే లక్ష్యంతో ఆమె మూడుసార్లు పరీక్షలు రాసినా ఆశించిన ఫలితం రాలేదు.
"""/" /
మరోవైపు ఆర్బీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో పరీక్షలు రాసినా ఆ పరీక్షలలో ఇషితా భాటియాకు అనుకూలంగా ఫలితాలు రాలేదు.
వైఫల్యం మనలో పట్టుదలను పెంచుతుందనే నమ్మకంతో ఆమె ఎన్నో పోటీ పరీక్షలు రాశారు.
2021లో ఆమె యూపీఎస్సీ ప్రిలిమ్స్( UPSC Prelims ) పాస్ అయ్యారు.టెలీగ్రాం గ్రూప్స్ సహాయంతో సందేహాలను నివృత్తి చేసుకుని చివరకు మెయిన్స్ కూడా పాస్ అయ్యారు.
"""/" /
జీవితం చాలా చిన్నదని ఇందులో మనకు మనమే స్పూర్తి కావాలని వైఫల్యాలను పాఠాలుగా తీసుకుంటే మనలో దాగున్న శక్తి బయటికొస్తుందని ఇషితా భాటియా చెప్పుకొచ్చారు.
నేను ఫెయిల్ అయినప్పుడల్లా నాకంటే ఎక్కువగా పేరెంట్స్ బాధ పడేవారని ఆమె తెలిపారు.
ఫెయిల్ అయిన ప్రతిసారి పట్టుదలతో ప్రయత్నించానని ఇషితా భాటియా కామెంట్లు చేశారు.ఇషితా భాటియా వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
ఇండియన్ బీచ్‌లో తెల్లతోలు పిల్ల దోపిడీ.. సెల్ఫీకి రూ.100 వసూలు చేస్తూ అడ్డంగా దొరికింది..