దేశంలో రోజురోజుకీ రోడ్డు ప్రమాదాలు భారీగా జరుగుతున్న సంగతి తెలిసిందే.దాదాపు రెండు లక్షలకు పైగానే సంవత్సరానికి రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు సంభవిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
ఇలాంటి తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడ కట్టడి చేసే రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నా గాని మరోపక్క ప్రమాదాలు నివారించే పరిస్థితి కనబడటం లేదు.పరిస్థితి ఇలా ఉండగా కేంద్రం తాజాగా మరో సరికొత్త నిర్ణయం తీసుకుంది.
చాలా వరకు వాహనాల వాళ్ళ ప్రమాదాలు దేశంలో సంభవిస్తున్న నేపద్యంలో .ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో వాహనంలో ఫ్రంట్ సీట్ లో ఎయిర్ బ్యాగ్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.ఏప్రిల్ ఫస్ట్ నుండి తయారయ్యే వాహనాలలో తప్పనిసరిగా ఈ రూల్ పాటించాలని కేంద్రం ఆదేశించింది.అదే రీతిలో ప్రస్తుతం వాడుతున్న వాహనాల్లో ఆగస్టు 31 నాటికి ఎయిర్ బ్యాగ్‌ను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తాజాగా స్పష్టం చేసింది.దేశంలో ప్రయాణికుల భద్రత విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని .రాష్ట్రాలు రోడ్డు ప్రమాదాల నివారణకు గట్టిగా చర్యలు చేపట్టాలని కేంద్రం తెలిపింది.