మౌనిక నా జీవితంలోకి రావడం నా అదృష్టం... మనోజ్ కామెంట్స్ వైరల్!

మంచు మనోజ్ ఇంట పెళ్లి సందడి మొదలైందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే మంచు మనోజ్ పెళ్లి వేడుకలను మహా మంత్ర పూజతో ప్రారంభించారని తెలుస్తోంది.

 I Am Lucky That Maunika Came Into My Life Manoj Comments Are Viral ,mounika , Ma-TeluguStop.com

అందుకు సంబంధించిన ఫోటోలను కూడా మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇప్పటికే మంచు వారి ఇంట పెళ్లి సందడి మొదలైందని తెలుస్తోంది.మంచు మనోజ్ మార్చి మూడవ తేదీన భూమా మౌనికతో కలిసి రెండవ పెళ్లికి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే ఇరు కుటుంబంలో కూడా పెళ్లి వేడుకలు జరుగుతున్నట్టు సమాచారం.ఇదివరకే మనోజ్ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోగా ప్రస్తుతం దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె మౌనిక రెడ్డిని ఈయన పెళ్లి చేసుకోబోతున్నారు.

Telugu Bhuma Nagi, Manchu Manoj, Manchu Manojs, Manoj, Mounika, Mounika Reddy-Mo

ఇక వీరి వివాహం అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోతుందని తెలుస్తోంది.ఇక మౌనికతో గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్నటువంటి మనోజ్ తన ప్రేమ ఎప్పుడు ఎక్కడ ప్రస్తావించలేదు అయితే గణేష్ ఉత్సవాలలో భాగంగా వీరిద్దరూ కలిసి జంటగా వెళ్లడంతో ఒక్కసారిగా వీరిద్దరి గురించి వార్తలు గుప్పుమన్నాయి.దీంతో మనోజ్ మౌనిక ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి.ఈ వార్తలు గురించి ఏకంగా మనోజ్ ను ప్రశ్నించడంతో ఈయన మంచి రోజు చూసుకొని ఈ శుభవార్తను చెబుతాను అంటూ దాటివేశారు.

Telugu Bhuma Nagi, Manchu Manoj, Manchu Manojs, Manoj, Mounika, Mounika Reddy-Mo

అయితే మార్చి మూడవ తేదీ వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.ఈ విషయంపై మనోజ్ స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ పెళ్లి కాక ముందు నుంచి మౌనికతో తనకు ఎంతో మంచి పరిచయం ఉందని, అయితే ఆ పరిచయం తర్వాత ప్రేమగా మారిందని తెలిపారు.తాను కష్ట సమయాలలో ఉన్నప్పుడు మౌనిక తనకు ఎంతో అండగా నిలిచారని ఇలాంటి ఒక మంచి అమ్మాయి తన జీవితంలోకి రావడం నిజంగా తన అదృష్టం అంటూ ఈ సందర్భంగా మనోజ్ మౌనిక గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అయితే మనోజ్ మౌనికతో ఉన్న స్నేహబంధంతోనే ఈయన మౌనిక మొదటి వివాహానికి కూడా హాజరయ్యారు.అయితే ఇద్దరికీ ఇది రెండవ పెళ్లి కావడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube