Husky Dog Cat Fun : పిల్లిని కత్తితో చంపాలనుకున్న కుక్క.. వీడియో వైరల్..

సోషల్ మీడియాలో కుక్క, పిల్లులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్‌ అవుతుంటాయి.ఇక కుక్క, పిల్లలు రెండూ ఉన్న వీడియోలైతే లక్షలు, కోట్లలో వ్యూస్ పొందుతాయి.

 Husky Dog Cat Fun : పిల్లిని కత్తితో చంపా-TeluguStop.com

తాజాగా ఒక కుక్క, ఓ పిల్లికి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ వైరల్ గా మారింది.ఈ ఫన్నీ క్లిప్‌లో కనిపించిన కుక్క హస్కీ జాతికి చెందినది, ఇది తోడేలు వలె కనిపించే ఒక రకమైన కుక్క.

వీడియోలో ఈ హస్కీ డాగ్( Husky Dog ) ఒక కిల్లర్ లాగా కనిపించే దుస్తులు ధరించింది.దాని పాదాలకు ఫేక్ కత్తి కూడా అటాచ్ చేశారు.

దాని ముఖం మీద ముసుగు ఉంది.అయితే ఓ పిల్లి ఈ హస్కీతో కలిసి ఓకే ఇంటిని షేర్ చేసుకుంటోంది.

అయితే ఆ పిల్లిని( Cat ) కత్తితో పొడిచినట్లు నటించింది కుక్క.అది పిల్లిని ఇంటి చుట్టూ వెంబడించింది.హస్కీ నుంచి పిల్లి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ హస్కీ వేగంగా పరిగెత్తి దానిని పట్టుకుంటుంది.హస్కీ కోపంగా, పిల్లిని బాధపెట్టాలనుకునేలా ప్రవర్తిస్తుంది, కానీ అది నిజానికి ఆడుతోంది.

పిల్లికి ఆ ఫేక్ కత్తి( Fake Knife ) వల్ల ఎలాంటి హాని జరగ లేదువీడియో చాలా ఫన్నీగా ఉండి నేటిజన్లను బాగా నవ్వించింది, ఇందులో హస్కీ నేచురల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కత్తితో నిజంగా పొడిచే లాగానే ప్రవర్తించింది.

దానికి ఫేక్ నైఫ్ కాస్ట్యూమ్ బాగా సెట్ అయింది.హస్కీకి మానవ చేతులు ఉన్నట్లు కూడా కనిపిస్తోంది.ఈ వీడియోను 23 మిలియన్ల మందికి పైగా వీక్షించారు, ఇన్‌స్టాగ్రామ్‌లో 758 వేల మందికి పైగా లైక్ చేసారు.

చాలా మంది ఈ వీడియోను ఎంత ఎంజాయ్ చేశామో చెబుతూ కామెంట్స్ పెట్టారు.మరి కొందరు ఫన్నీ జోకులు కూడా పేల్చారు.హస్కీ పిల్లిని వీడియోను @madam.pachira అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేశారు.

ఈ యూజర్ పెంపుడు జంతువులు తమాషా చేస్తున్న వీడియోలను తరచుగా షేర్ చేస్తుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube