పాదాల పగుళ్లు( Cracked feet ).మనలో చాలా మందిని కామన్ గా ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఒకటి.
గంటలు తరబడి నిలబడడం, ఊబకాయం, మధుమేహం, ఎముకల బలహీనత, చెప్పులు లేకుండా నడవడం తదితర కారణాల వల్ల పాదాల పగుళ్ల సమస్యకు గురవుతారు, అందులోనూ ప్రస్తుత చలికాలంలో పాదాల పగుళ్లు మరింత అధికంగా ఇబ్బంది పెడుతుంటాయి.పగుళ్ల కారణంగా కొందరికి నడవడం కూడా ఎంతో ఇబ్బందిగా మారుతుంటుంది.
ఈ క్రమంలోనే పాదాల పగుళ్లను వదిలించుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్ ను రోజు నైట్ రాశారంటే పగుళ్లను శాశ్వతంగా వదిలించుకోవచ్చు.పాదాలను మృదువుగా కోమలంగా మార్చుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ న్యాచురల్ క్రీమ్( Natural cream ) ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బీస్ వాక్స్( Beeswax ) వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి( ghee ), వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె( coconut oil ), హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో ఉంచి డబుల్ బాయిలర్ మెథడ్( Double boiler method ) లో పదార్థాలు అన్నిటినీ కరిగించుకోవాలి.ఆపై కరిగించుకున్న మిశ్రమాన్ని ఒక బాక్స్ లో నింపుకుని గంట పాటు వదిలేస్తే మన క్రీమ్ సిద్ధం అవుతుంది.రోజు నైట్ నిద్రించే ముందు పాదాలను వాటర్ తో శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి.
ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ను పాదాలకు అప్లై చేసి సున్నితంగా ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.చివరిగా సాక్స్ ధరించి నిద్రించాలి.ఇలా ప్రతిరోజూ కనుక చేశారంటే పాదాల పగుళ్లు పరార్ అవుతాయి.
ఈ న్యాచురల్ క్రీమ్ లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ మరియు పలు పోషకాలు పాదాలను హైడ్రేటెడ్ గా మారుస్తాయి.పగుళ్లను నివారిస్తాయి.పాదాల పగుళ్లతో బాధపడుతున్న వారికి ఈ క్రీమ్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది, రోజు నైట్ ఈ క్రీమ్ ను వాడితే పగుళ్లు మాయమై పాదాలు మృదువుగా అందంగా మారతాయి.