చ‌నిపోయిన భార్య విగ్ర‌హాన్ని ఇంట్లో పెట్టుకుని పూజిస్తున్న భ‌ర్త‌..

భార్య‌, భ‌ర్త‌లు అంటే ఆ జ‌న్మాంతం క‌లిసి ఉండే పెద్ద బంధం.భార్య భ‌ర్త‌లు అంటే ఒక‌రిలో ఒక‌రు సగం అని అర్థం వారి అనుబంధం ముందు ఎలాంటి బంధం అయినా చిన్న‌దే అని చెప్పాలి.

 Husband Worshiping Idol Of Dead Wife At Home, Wife Idol, Great Husband ,karnatak-TeluguStop.com

ఎందుకంటే ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా స‌రే బెద‌ర‌కుండా ఇద్ద‌రూ క‌లిసి ప్ర‌యాణిస్తుంటారు.ఒక‌రి క‌ష్టాల్లో ఒక‌రు తోడుగా న‌డిచేదే దాంప‌త్యం.

అందుకే ఆ బంధానికి స‌మాజంలో అంత విలువ ఉంది.కానీ కొంద‌రు మాత్రం చిన్న చిన్న కార‌ణాల‌కే విడిపోతుంటారు.

ఇంకొంద‌రు భ‌ర్త‌లు చీటికి మాటికి భార్య‌ను కొడుతూనే ఉంటారు.ఇలాంటి ఘ‌ట‌న‌లు మనం అనేకం చూస్తూనే ఉన్నాం.

కానీ నిజానికి భార్య లేని జీవితం భ‌ర్త‌కు శూన్యం లాంటిది.అందుకే చాలామంది భ‌ర్త‌లు భార్య‌ల‌ను నెత్తిన పెట్టుకుని పూజిస్తుంటారు.భార్య‌కు ఏ చిన్న ఆప‌ద వ‌చ్చినా స‌రే ద‌గ్గ‌రుండి కంటికి రెప్ప‌లా చూసుకునే వారు కోకొల్ల‌లుగా ఉన్నారు.అయితే ఇప్పుడు కూడా ఇలాటి ఓ భ‌ర్త గురించే చెప్ప‌బోతున్నాం.

ఆయ‌న భార్య చ‌నిపోయినా స‌రే త‌న‌ను వ‌దిలి ఉండ‌లేక ఏకంగా త‌న ఇంట్లోనే గుడిక‌ట్టుకుని పూజిస్తున్నాడు.మ‌న ప‌క్క‌నే ఉన్న‌టువంటి కర్ణాటక రాష్ట్రానికి చెందిన‌టువంటి బెళగావి ప్రాంతంలో నివ‌సించే శివ చౌగలే, మైనాభాయ్ భార్యాభ‌ర్త‌లు.

Telugu Mainabai, Shiva Chougule, Corona, Idol-Latest News - Telugu

కాగా రీసెంట్ గా త‌న భార్య క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించింది.ఇద్ద‌రికీ క‌రోనా సోక‌గా అత‌ను మాత్ర‌మే ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ్డాడు.కానీ ఆమె మాత్రం చివ‌ర‌కు ప్రాణాలు విడిచింది.దీంతో భార్య ఎడ‌బాటును భ‌రించ‌లేని ఆయ‌న ఆమె విగ్రహాన్ని తయారు చేయించుకుని త‌న ఇంట్లో పెట్టుకున్నాడు.త‌న భార్య ఎప్ప‌టికీ త‌న‌తోనే ఉన్న ఫీలింగ్ క‌ల‌గాల‌ని ఇలా చేశాడు ఆయ‌న‌.అచ్చం త‌న భార్య లాగే సహజత్వం ఉట్టిపడే విధంగా దాన్ని త‌యారు చేయించాడు.

ఇక నిత్యం ఆ విగ్ర‌హానికి పూజ చేయ‌కుండా ఆయ‌నెటూ వెళ్లే వాడు కాదు.అత‌న్ని చూసిన వారంతా అభినందిస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube