చ‌నిపోయిన భార్య విగ్ర‌హాన్ని ఇంట్లో పెట్టుకుని పూజిస్తున్న భ‌ర్త‌..

భార్య‌, భ‌ర్త‌లు అంటే ఆ జ‌న్మాంతం క‌లిసి ఉండే పెద్ద బంధం.భార్య భ‌ర్త‌లు అంటే ఒక‌రిలో ఒక‌రు సగం అని అర్థం వారి అనుబంధం ముందు ఎలాంటి బంధం అయినా చిన్న‌దే అని చెప్పాలి.

ఎందుకంటే ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా స‌రే బెద‌ర‌కుండా ఇద్ద‌రూ క‌లిసి ప్ర‌యాణిస్తుంటారు.ఒక‌రి క‌ష్టాల్లో ఒక‌రు తోడుగా న‌డిచేదే దాంప‌త్యం.

అందుకే ఆ బంధానికి స‌మాజంలో అంత విలువ ఉంది.కానీ కొంద‌రు మాత్రం చిన్న చిన్న కార‌ణాల‌కే విడిపోతుంటారు.

ఇంకొంద‌రు భ‌ర్త‌లు చీటికి మాటికి భార్య‌ను కొడుతూనే ఉంటారు.ఇలాంటి ఘ‌ట‌న‌లు మనం అనేకం చూస్తూనే ఉన్నాం.

కానీ నిజానికి భార్య లేని జీవితం భ‌ర్త‌కు శూన్యం లాంటిది.అందుకే చాలామంది భ‌ర్త‌లు భార్య‌ల‌ను నెత్తిన పెట్టుకుని పూజిస్తుంటారు.

భార్య‌కు ఏ చిన్న ఆప‌ద వ‌చ్చినా స‌రే ద‌గ్గ‌రుండి కంటికి రెప్ప‌లా చూసుకునే వారు కోకొల్ల‌లుగా ఉన్నారు.

అయితే ఇప్పుడు కూడా ఇలాటి ఓ భ‌ర్త గురించే చెప్ప‌బోతున్నాం.ఆయ‌న భార్య చ‌నిపోయినా స‌రే త‌న‌ను వ‌దిలి ఉండ‌లేక ఏకంగా త‌న ఇంట్లోనే గుడిక‌ట్టుకుని పూజిస్తున్నాడు.

మ‌న ప‌క్క‌నే ఉన్న‌టువంటి కర్ణాటక రాష్ట్రానికి చెందిన‌టువంటి బెళగావి ప్రాంతంలో నివ‌సించే శివ చౌగలే, మైనాభాయ్ భార్యాభ‌ర్త‌లు.

"""/"/ కాగా రీసెంట్ గా త‌న భార్య క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించింది.ఇద్ద‌రికీ క‌రోనా సోక‌గా అత‌ను మాత్ర‌మే ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ్డాడు.

కానీ ఆమె మాత్రం చివ‌ర‌కు ప్రాణాలు విడిచింది.దీంతో భార్య ఎడ‌బాటును భ‌రించ‌లేని ఆయ‌న ఆమె విగ్రహాన్ని తయారు చేయించుకుని త‌న ఇంట్లో పెట్టుకున్నాడు.

త‌న భార్య ఎప్ప‌టికీ త‌న‌తోనే ఉన్న ఫీలింగ్ క‌ల‌గాల‌ని ఇలా చేశాడు ఆయ‌న‌.

అచ్చం త‌న భార్య లాగే సహజత్వం ఉట్టిపడే విధంగా దాన్ని త‌యారు చేయించాడు.

ఇక నిత్యం ఆ విగ్ర‌హానికి పూజ చేయ‌కుండా ఆయ‌నెటూ వెళ్లే వాడు కాదు.

అత‌న్ని చూసిన వారంతా అభినందిస్తున్నారు.

స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్న ప్రశాంత్ వర్మ…