గత కొన్ని నెలలుగా హెచ్ -4 వర్క్ పర్మిట్ వీసాపై కొనసాగుతున్నసందిగ్ధతని రెండు రోజుల క్రితం ట్రంప్ సర్కార్ పూర్తిగా వ్యతిరేకిస్తూ తీసుకున్న నిర్ణయం ఎంత సంచలనం కలిగించిందో వేరే చెప్పనవసరం లేదు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం ఎంతో మంది భారతీయ టెకీలపై ప్రభావం చూపనుంది.దాంతో మల్లగుల్లాలు పడుతూ ఆందోళనకి లోనవుతున్న భారతీయులకి తాజాగా ఓ వార్త కొంత ఊరటనిచ్చింది అనే చెప్పాలి.
అదేంటంటే.
హెచ్1-బీ వీసా జీవిత భాగస్వాములకు ఉన్న హెచ్-4వీసా వర్క్‌పర్మిట్‌ను తొలగించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పై ఈ వేసవిలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.అయితే ఈ క్రమంలోనే కొందరు శాసనకర్తల నుంచి, ఐటీ ఇండస్ట్రీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవవుతోంది.పని అనుమతి రద్దు చేస్తే అధికంగా నష్టపోయేది భారతీయులే.
అయితే హెచ్-4 వర్క్ పర్మిట్ రద్దు చెయ్యాలనే నిర్ణయాన్ని చాలా మంది శాసనకర్తలు, ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సహా పలు ఐటీ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి.
ట్రంప్ సర్కార్ నిర్ణయం వల్ల ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోతారు దీనివలన ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోతారని, ఇది ఎన్నో కుటుంబాలపై ప్రభావం చూపిస్తుందని, అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బ తీస్తుందని సిలికాన్‌వ్యాలీకి చెందిన ఎఫ్‌డబ్ల్యుడీ.
యూఎస్ వెల్లడించింది.దీన్ని టాప్ ఐటీ కంపెనీలైన ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ తరహా పలు కంపెనీలు కలిసి ఏర్పాటు చేశాయి.
అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపారు…ఈ నిర్ణయం వల్ల మా కంపెనీలు భారీగా నస్తాన్ని చవిచూస్తానని హెచ్ 4 వీసాదారుల్లో 80శాతం మంది మహిళలే ఉన్నారని, వారు చాలా విజయవంతంగా ఉద్యోగాలు చేస్తున్నారని, వారు తమ జీవితభాగస్వాములతో అమెరికా రాకముందు వారి వారి దేశాల్లో పీజీలు చేసి వస్తున్నారని పేర్కొంది…అంతేకాదు అమెరికా ఆర్ధిక ప్రగతిపై ఈ నిర్ణయం పూర్తిగా ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు ఆర్థక నిపుణులు
.