సివిల్ జడ్జిగా ఎలా ఎంపిక అవుతారు? ఇందుకోసం లా చ‌దివాక ఏం చేయాలంటే...

న్యాయవాద రంగాన్ని తమ వృత్తిగా చేసుకుని, దానిని ప్రాక్టీస్ చేస్తున్న వారంద‌రిలోనూ సివిల్ జడ్జి కావాలనే ఆకాంక్ష బ‌లంగా కనిపిస్తుంది.మరోవైపు లా చేస్తున్న అభ్యర్థులందరూ లేదా లా డిగ్రీ పొందిన అభ్యర్థులందరూ తాము న్యాయమూర్తిగా కావాలని క‌ల‌లు కంటారు.

 How To Get Selected As A Civil Judge? What To Do Without Reading The Law For Thi-TeluguStop.com

అయితే న్యాయమూర్తి కావాలంటే ఇందుకు చాలా విషయాలు తెలుసుకోవాలి.అదే సమయంలో న్యాయమూర్తిగా ఎలా ఎంపిక అవుతారో చాలామందికి తెలియని ప‌రిస్థితి ఉంది.

అయితే దీనికి మార్గం తెలుసుకున్న న్యాయ‌వాదులు కొన్నిప‌రీక్ష‌లు పాస‌వ‌డంద్వారా తమ కలను సాకారం చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.న్యాయ‌మూర్తి అయ్యేందుకు ప‌లు పరీక్షలలో విజ‌యం సాధించ‌డం ద్వారా సివిల్ జడ్జి కుర్చీలో కూర్చోవ‌చ్చు.లా పూర్తి చేసిన తర్వాత సివిల్ జడ్జిగా ఎలా అవ్వాలో ఈ స‌మాచారం ద్వారా తెలుసుకుందాం.

ఈ పరీక్షలు పూర్తి చేయాలి.

Telugu Civil Judge, Judicial, Judge, Llb Degree, Law-Latest News - Telugu

సివిల్ జడ్జి కావాలంటే ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ డిగ్రీ తప్పనిసరిగా క‌లిగి ఉండాలి.ఆ తర్వాత మీరు సివిల్ జడ్జి రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరు కావచ్చు.ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తారనే విష‌యం గుర్తుంచుకోండి.ఈ పరీక్షను జ్యుడీషియల్ సర్వీస్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది.సివిల్ జడ్జి కావాలంటే అభ్యర్థులు మూడు దశలను దాటాలి.ఇందులో ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనల్ ఇంటర్వ్యూ మొద‌లైన‌వి ఉంటాయి.

ఈ పరీక్ష ఈ అంశాలపై ఆధారపడి ఉంటుంది

Telugu Civil Judge, Judicial, Judge, Llb Degree, Law-Latest News - Telugu

ఈ పరీక్షలో రెండు రకాల రిక్రూట్‌మెంట్‌లు ఉంటాయి.ఇందులో లోయర్ జ్యుడీషియల్ సర్వీస్, హయ్యర్ జ్యుడీషియల్ సర్వీస్ పరీక్షలు ఉంటాయి.మీరు లోయర్ జ్యుడీషియల్ సర్వీస్‌లో చేరాలనుకుంటే, మీకు 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లేదా 3 సంవత్సరాల జనరల్ డిగ్రీ అవసరం.అదే సమయంలో ఈ పరీక్షకు హాజరు కావడానికి ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు.

ఇందులో మీరు హయ్యర్ జ్యుడీషియల్ సర్వీస్‌లో చేరాలనుకుంటే, మీకు లా డిగ్రీతో పాటు 7 సంవత్సరాల అనుభవం కూడా ఉండాలి.అలాగే ఈ వృత్తిలో నైపుణ్యం ఉండాలి.

అప్పుడే మీరు ఈ పరీక్షను క్లియర్ చేయగలుగుతారు.ఈ పరీక్ష రెండు పేపర్ల ఆధారంగా ఉంటుంది.

మొదటి పేపర్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.కాగా రెండో పేపర్‌లో చట్టానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube