EPF Account Balance : ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకునేందుకు సింపుల్ ప్రాసెస్ ఇదే..!

ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగం చేసే వారికి కచ్చితంగా పీఎఫ్ ఖాతా( PF Account ) ఉంటుంది అని అందరికీ తెలిసిందే.అయితే చాలామందికి తమ పీఎఫ్ ఖాతాలో ఇప్పటివరకు ఎంత అమౌంట్ క్రెడిట్ అయ్యిందో అనే విషయం తెలియదు.

 How To Check Epf Account Balance Online-TeluguStop.com

అంతేకాదు ఈపీఎఫ్ బ్యాలెన్స్( EPF Balance ) ఎలా చెక్ చేసుకోవాలో కూడా చాలామందికి తెలియదు.ఇంకొంతమందికైతే UAN నెంబర్ ఏంటో కూడా తెలియదు.

మరిఈపీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా HR వద్దకు వెళ్లాల్సిందే.ప్రతి నెల మీ పీఎఫ్ ఖాతా గురించి HR వద్దకు వెళ్లాల్సిందే.

అలా కాకుండా మీ ఈపీఎస్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో సింపుల్ ప్రాసెస్ ద్వారా మీరే తెలుసుకోవచ్చు.ఈపీఎఫ్ అకౌంట్ నెంబర్ UAN ను HR కు అడిగి తెలుసుకోవాలి.

ఆ తర్వాత ఈపీఎఫ్ అధికారిక వెబ్సైట్ లో పీఎఫ్ అకౌంట్ తో UAN నెంబర్( UAN Number ) ను లింక్ చేయాలి.

Telugu Epf, Epfo, Epfo Balance, Uan-Technology Telugu

UAN అకౌంట్ యాక్టివేషన్( UAN Account Activation ) చేసుకున్న తర్వాత ఆధార్ కార్డ్ వివరాలు, రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ లాంటి వివరాలు సమర్పించాలి.అన్ని వివరాలు సమర్పించిన తర్వాత మొబైల్ ఫోన్ కు ఒక ఓటిపి వస్తుంది.ఆ ఓటిపి( OTP )ని ఎంటర్ చేయగానే ఒక కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది.

ఇక ఈపీఎఫ్ వెబ్సైట్లోకి వెళ్లి UAN నెంబర్ ను, పాస్వర్డ్ ను ఎంటర్ చేసి లాగిన్ అయితే అక్కడ మీ పాస్ బుక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.దానిపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి.

అందులో మీ ఈపీఎఫ్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో, ప్రతి నెల ఎంత అమౌంట్ క్రెడిట్ అవుతుందో స్పష్టంగా కనిపిస్తుంది.

Telugu Epf, Epfo, Epfo Balance, Uan-Technology Telugu

ఒకవేళ మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా ఈపీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుంటే.EPFOHO UAN అని టైప్ చేసి.7738299899 అనే నెంబర్ కి ఎస్ఎంఎస్ పంపిస్తే, మన ఫోన్ కు ఎస్ఎంఎస్ ద్వారా ఈపీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ వివరాలు వస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube