షాజ్‌హాన్ నిర్మించిన స్మారకాల చరిత్ర ఇదే!

భారతదేశంలో వున్న పర్యాటక కేంద్రాల గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అందులో ఒకటి తాజ్ మహల్.

 History Of Monuments Built By Shah Jahan Details, Latest News, Viral Latest, New-TeluguStop.com

( Taj Mahal ) దీని గురించి తెలియనివారు ఎవరుంటారు చెప్పండి? ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటైన దీనిని చూడడానికి ప్రతి ఏటా ఇక్కడికి కొన్ని లక్షలమంది వస్తూ పోతుంటారు.దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్( Shah Jahan ) తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం నిర్మించాడనే విషయం మనం చిన్నప్పుడే చదువుకున్నాం.

అయితే షాజహాన్ తన హయాంలో “తాజ్ మహల్” మాత్రమే కాకుండా అనేక నిర్మాణాలను నిర్మించాడని మీలో ఎంతమందికి తెలుసు? ఇక్కడ కొన్నిటిని గురించి తెలుసుకుందాం.

Telugu Agra Fort, Jama Masjid, Latest, Shah Jahan, Mothi Masjid, Red Fort, Taj M

భారతదేశంలోని ప్రసిద్ధ గాంచిన “ఎర్రకోట”ను( Red Fort ) షాజహాన్ నిర్మించాడనే విషయం మీకు తెలుసా? ఆయనకు వాస్తుశిల్పం అంటే ఇష్టం.కాబట్టి ఆగ్రాలోనే కాకుండా దేశంలోని పలు చోట్ల చారిత్రక కట్టడాలను నిర్మించాడు.ఢిల్లీలోని ఎర్రకోట కూడా ఇదే క్రమంలో నిర్మించబడిందే.

ఈ కోట ఎర్ర ఇసుకరాయితో నిర్మించబడింది.అందుకే దీనిని ఎర్రకోట అని పిలుస్తారు.

తాజ్ మహల్ తర్వాత ఆగ్రాలో అత్యధికంగా సందర్శించే స్మారక చిహ్నం ఆగ్రా కోట. ఇది అక్బర్ పాలనలో నిర్మించబడింది.కానీ దాని ప్రస్తుత నిర్మాణం యొక్క ఘనత షాజహాన్‌కు చెందుతుంది.

Telugu Agra Fort, Jama Masjid, Latest, Shah Jahan, Mothi Masjid, Red Fort, Taj M

ఇక “మోతీ మసీదు” మరొక అందమైన పాలరాతి నిర్మాణం.తాజ్ మహల్ కాకుండా షాజహాన్ నిర్మించిన అందమైన స్మారక కట్టడాలలో ఇది ఒకటిగా పేరు పొందింది.షాజహాన్ తన హయాంలో 1647లో దీనిని నిర్మించాడు మరియు 1654లో ఈ మసీదు పూర్తయింది.

అలాగే “జామా మసీదు” అనేది కూడా మొఘల్ వాస్తుశిల్పానికి ఓ మచ్చుతునక.జామా మసీదును షాజహాన్ నిర్మించాడని నేటికీ చాలా మందికి తెలియకపోవడం బాధాకరం.ఇక “తాజ్‌మహల్‌” గురించి ఈ ప్రపంచానికే తెలుసు.ప్రేమకు ప్రతీకగా భావించే ఈ భవనం ప్రపంచ వ్యాప్తంగా అందానికి ప్రసిద్ధి చెందింది.

ఈ సమాధి మొత్తం పాలరాతితో నిర్మించబడింది.భారతదేశం యొక్క శ్రేయస్సును ప్రతిబింబించే ఈ భవనం 1983 నుండి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం జాబితాలో చేర్చబడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube