బండ్ల గణేష్ (Bandla Ganesh) గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగిపోతున్న పేరు.ఈయన సినిమాలు నిర్మించడం కంటే కూడా సోషల్ మీడియా వేదికగా చేసే ట్వీట్లో పెద్ద ఎత్తున గుర్తింపును తీసుకువచ్చాయని చెప్పాలి.
గత రెండు రోజుల క్రితం వరకు గురూజీ అంటూ ఈయనచేసిన ట్వీట్స్ సంచలనంగా మారిన విషయం మనకు తెలిసిందే.అయితే ఇది మర్చిపోకముందే మరోసారి బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఒక వెబ్సైట్ (Web Site) గురించి ఆ వెబ్సైట్ అధినేత గురించి మాట్లాడుతూ వారికి తన స్టైల్ లో వార్నింగ్ ఇస్తూ చేసినటువంటి వరుస ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒక వెబ్సైట్ బండ్ల గణేష్ గురించి ఓ ఆర్టికల్ రాశారు.దీంతో మండిపడిన బండ్ల గణేష్ ఆ ఆర్టికల్ ను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ సదరు అధినేత పై తీవ్రస్థాయిలో మండిపడుతూ వరుసగా ట్వీట్లు చేశారు.అరే వెంకట్ రెడ్డి( venkat reddy ) ఓ పెద్ద బ్రోకర్ మీ మూర్తి చిన్న బ్రోకర్ నీలి వార్తలు రాసుకుని నీలి బతుకులు బతుకుతూ దొంగచాటుగా తిరిగే నీకు మా గురించి ఎందుకురా లఫూట్ అంటూ ఘాటుగా ప్రశ్నించాడు.మేము ప్రేమిస్తాం… ప్రాణం ఇస్తాం.
పూజిస్తాం కోపం వస్తే అలుగుతాము.ప్రేమించినప్పుడు పూజించినప్పుడు అలిగే హక్కు కూడా ఉంటుందిరా లఫూట్ అంటూ కామెంట్లు చేశారు.
బండ్ల గణేష్ సినిమా వాళ్లు సినిమా వార్తలు లేకపోతే నీకు రోజు కూడా గడవదు.

నువ్వు కనుక నిజంగా మనిషివి అయితే కడుపుకు అన్నమే తింటూ ఉంటే ఒకసారి వచ్చి ప్రత్యక్షంగా నాకు కనిపించు.నీలి వార్తలు రాసుకుంటూ బతికే నీకు నువ్వు లేనప్పుడు మీ ఇంట్లో జరిగే నీలి చిత్రాల గురించి కూడా ఆలోచించు అంటూ కామెంట్ చేశారు.ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉండే వాడితో దూరంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి.
నీతిగా బతికేం వాడి జోలికి అసలు రావద్దు మాడి మసైపోతావు అంటూ ఈ సందర్భంగా బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో మండిపడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అలాగే సినిమా ఇండస్ట్రీ వారికి కూడా కొన్ని సూచనలు సలహాలు కూడా ఇచ్చారు.
ఇలాంటి వెబ్ సైట్లకు ఇంటర్వ్యూ ఇవ్వడం మానుకోవాలని ఇలాంటి వాటిని బ్యాన్ చేయాలి అంటూ ఈ సందర్భంగా సెలబ్రిటీలకు కూడా బండ్ల గణేష్ సూచనలు చేస్తూ చేసిన ఈ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.







