తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యాత్రకు పూర్తి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది.తను చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రకు అదనపు సెక్యూరిటీ కల్పించాలన్న రేవంత్ రెడ్డి న్యాయస్థానాన్ని కోరిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ధర్మాసనం విచారణ చేపట్టగా యాత్ర సందర్భంగా రేవంత్ రెడ్డి చుట్టూ 69 మంది భద్రత సిబ్బందిని ఏర్పాటు చేశామని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు.అయితే ఇప్పుడున్న భద్రత కేవలం ట్రాఫిక్ కట్టడి కోసమే ఇస్తున్నారని రేవంత్ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు నైట్ హాల్ట్ లోనూ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.