హీరోలలో కనిపించని ఐక్యమత్యం హీరోయిన్స్ లో కనిపించింది

సినీ నటి, వైకాపా నాయకురాలు మంత్రి ఆర్కే రోజా( Minister RK Roja ) పై తెలుగు దేశం పార్టీ నాయకుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి.తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆయన్ను సమర్థించడం మరింత విడ్డూరంగా ఉంది అంటూ రోజా సన్నిహితులు అంటున్నారు.

 Heroines Support To Minister Roja , Minister Roja, Radhika, Khushbu, Navneet Kau-TeluguStop.com

ఇప్పటికే ఆ తెలుగు దేశం పార్టీ నాయకుడు అరెస్ట్‌ అయ్యాడు.ఆయన అరెస్ట్‌ అయినా కూడా రోజా కి మద్దతు పెద్ద ఎత్తున పెరుగుతోంది.

ఇప్పటికే రోజా కి ఆ నాయకుడు క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ సీనియర్ హీరోయిన్స్ అయిన రాధిక, ఖుష్బు, నవనీత్ కౌర్ ( Radhika, Khushbu, Navneet Kaur )ఇంకా కొందరు ఇండస్ట్రీకి చెందిన వారు డిమాండ్‌ చేస్తున్నారు.గతంలో హీరోల గురించి రాజకీయ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఏ ఒక్కరు స్పందించలేదు.

కానీ హీరోయిన్‌ లు మాత్రం రోజా కోసం రంగంలోకి దిగడం బాగుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.హీరో ల్లో లేని ఐక్యత హీరోయిన్స్ లో ఉంది.అది కూడా ఒక గొప్ప విషయం అన్నట్లుగా మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇండస్ట్రీ వర్గాల్లో రోజా పై ఆ నాయకుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి.

అదే సమయంలో రోజా కి విపరీతంగా పెరుగుతూనే ఉంది.ప్రస్తుతం ఆ నాయకుడు జైల్లో ఉన్నా కూడా వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే అంటూ రోజా కి మద్దతుగా ఆమె సన్నిహితులు రాజకీయాలతో సంబంధం లేకుండా స్పందిస్తున్నారు.

రోజా ఒక మంత్రి.ఒక మహిళ అలాంటి వ్యక్తి గురించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం ఏంటి అంటూ రోజా మద్దతుదారులు ఆందోళన చేస్తున్నారు.తెలుగు దేశం పార్టీ నుంచి ఆ నాయకుడిని బహిష్కరించడంతో పాటు, ఆయనకు కఠిన శిక్ష పడాల్సిందే అన్నట్లుగా వైకాపా శ్రేణులు డిమాండ్‌ చేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube