ఫ్లిప్‌కార్ట్ వి‌ఐపి ప్లాన్ కు పోటీ ఇస్తోన్న అమెజాన్ 'ప్రైమ్ షాపింగ్ ఎడిషన్' ప్లాన్?

మీరు ఆన్లైన్ షాపింగ్ ప్రియులా? అయితే మీకు ఓ శుభవార్త.అమెజాన్ ‘ప్రైమ్ షాపింగ్ ఎడిషన్( Amazon Prime Shopping Edition Plan )’ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఇపుడు అందుబాటులోకి వచ్చింది.

 Amazon 'prime Shopping Edition' Plan Competing With Flipkart Vip Plan , Amazon-TeluguStop.com

దీని ద్వారా ఫ్రీ షిప్పింగ్, వన్డే డెలివరీ సహా అనేక బెనిఫిట్స్ లభిస్తాయి.అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానుండగా, ప్రైమ్ యూజర్లకు ఒక్క రోజు ముందుగానే అంటే అక్టోబర్ 7 నుంచే ఈ మెగా సేల్ అందుబాటులోకి రావడం కొసమెరుపు.

అయితే అమెజాన్ ఈ పండుగ సీజన్ను క్యాష్ చేసుకునేందుకు సిద్ధం కాగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఇటీవలే వీఐపీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ను( Flipkart VIP plan ) అందుబాటులోకి తెచ్చింది.

Telugu Prime, Amazon Prime, Vip, Latest-Latest News - Telugu

అవును, దీని సంవత్సర చందా రూ.499 మాత్రమే అని ప్రకటించి అందరినీ ఖుషీ చేసింది.దీని ద్వారా ఫ్లిప్కార్ట్ యూజర్లకు అనేక ఆఫర్స్, డిస్కౌంట్స్, హోమ్ డెలివరీ ఫెసిలిటీస్ విరివిగా అందిస్తోంది.

దాంతో ఇపుడు దీనికి పోటీగా అమెజాన్ ఇప్పుడు ‘ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ సబ్స్క్రిప్షన్‘ ప్లాన్ను అందుబాటులోకి తేవడం కొసమెరుపు.ఇలా ఇవి ఒకదాని తరువాత ఒకటి పోటాపోటీగా వ్యవహరించడం గమనార్హం.పైగా దీని సంవత్సర చందాను కేవలం రూ.399గా నిర్ణయించింది.అయితే దీనిన ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మాత్రమే ప్రత్యేకంగా తీసుకు వచ్చినట్టు తెలుస్తోంది.

Telugu Prime, Amazon Prime, Vip, Latest-Latest News - Telugu

ఇకపోతే ఆండ్రాయిడ్ ఫోన్లలోని అమెజాన్ యాప్, అమెజాన్ ( Amazon )మొబైల్ బ్రౌజర్లలో ఈ సరికొత్త అమెజాన్ ‘ప్రైమ్ షాపింగ్ ఎడిషన్‘ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.అదేవిధంగా అమెజాన్ ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారికి.ప్రైమ్ యూజర్ల మాదిరిగానే అన్ని బెనిఫిట్స్ లభిస్తాయి.

ముఖ్యంగా ఫ్రీ షిప్పింగ్, వన్డే డెలివరీ వెసులుబాటు కలదు.అయితే అమెజాన్ తీసుకువచ్చిన ఈ ‘ప్రైమ్ షాపింగ్ ఎడిషన్’ ప్లాన్ అనేది సంవత్సరం అంతా పనిచేస్తుందా? లేదా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లాంటి ప్రత్యేకమైన సేల్స్ టైమ్లోనే పనిచేస్తుందా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రావలసి వుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube