పూరీ జగన్నాథ్ ఈ పేరుని కొత్తగా పరిచయమే అవసరం లేదు.తనదైన శైలిలో సినిమాలు చేస్తూ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ కొడుతూ సక్సెస్ తో సంబంధం లేకుండా సినిమాలు తీస్తున్నాడు.
తన మొదటి సినిమా అయిన బద్రి తోనే ఇండస్ట్రీ లో కొత్తదనం చూపించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.ప్రెసెంట్ వున్న అందరి స్టార్ హీరోస్ కి హిట్స్ ఇచ్చాడు పూరి.
అలాంటి పూరి నీ ఒక ఫ్లాప్ హీరో మూడు సార్లు రిజెక్ట్ చేశాడు.ఆ హీరో ఎవరో కాదు అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడు హీరో సుమంత్.
సుమంత్ ఒక 6 అడుగుల కటౌట్.ఒక హీరో కి ఏం కావాలో అన్ని పుష్కలంగా ఉన్న హీరో.
ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ వున్న దాన్ని ఎక్కడ వాడకుండా తనకు నచ్చిన సినిమాలు చేసి ప్రతి కథలో కొత్తదనం చూపించడానికి ప్రయత్నం చేసేవాడు.అంతేకాదు సుమంత్ తన కెరియర్ మొదట్లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు.
అప్పట్లో అక్కినేని అభిమానులు అందరూ అక్కినేని అసలైన వారసుడు సుమంత్ మాత్రమే అంటూ కటౌట్లు కూడా పెట్టారు.కానీ సుమంత్ దాన్ని ఎక్కువకాలం నిలబెట్టుకోలేకపోయాడు.
అంతేకాదు ఇప్పుడు స్టార్ గా కదూ కదా కనీసం మంచి సినిమాలు చేస్తున్న హీరో గా కూడా గుర్తింపు సాధించలేకపోయాడు.దానికి కారణం అతను రిజెక్ట్ చేసిన సినిమాలు.
ఇండస్ట్రీ హిట్ అయినా ఎన్నో సినిమాలు సుమంత్ ని వెతుక్కుంటూ వచ్చినా వాటిని ఉపయోగించుకోలేకపోయాడు.ఆయన రిజెక్ట్ చేసిన సినిమాలు వేరే హీరోస్ చేసి ఇండస్ట్రీ హిట్స్ కూడా కొట్టారు.
ఒకవేళ ఆ మూవీస్ సుమంత్ చేసినట్లయితే ఇప్పుడు సుమంత్ నంబర్ వన్ హీరో అయ్యేవాడు.సుమంత్ రిజెక్ట్ చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ పోకిరి.
అవును పోకిరి కథ ముందు సుమంత్ కే చెప్పాడు పూరి అయితే ఆ కథ సుమంత్ కి నచ్చలేదు పూరి కి నో చెప్పాడు.దాంతో ఆ కథ మహేష్ బాబు చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టి సూపర్ స్టార్ గా ఎదిగాడు.
అలానే దేశముదురు కథ కూడా పూరి సుమంత్ కే ఫస్ట్ చెప్పాడు మరీ ఆ క్యారెక్టర్ అతనికి సెట్ అవ్వదు అనుకున్నాడేమో పూరి కి నో చెప్పాడు.
అయితే ఆ కథ అల్లు అర్జున్ చేసి ఒక బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు.ఇదిలా ఉంటే రవితేజ నీ మాస్ మహరాజ్ గా చేసిన మూవీ ఇడియట్.ఈ సినిమా రవితేజ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అని చెప్పాల్సిందే.ఈ సినిమాతో చాలా క్రేజ్ సంపాదించాడు రవితేజ.ఇలాంటి మూవీ నీ సుమంత్ రిజెక్ట్ చేశాడు మొదట ఈ కథని పూరి సుమంత్ కి చెప్పాడు.ఎందుకో తెలీదు కానీ పూరి చెప్పిన ప్రతి కథని సుమంత్ రిజెక్ట్ చేస్తూనే వచ్చాడు.కానీ ఆ కథలతోనే పూరి స్టార్ డైరెక్టర్ గా ఏదిగాడు.
అయితే పూరి ఎందుకోగాని సుమంత్ తో సినిమా చేయాలని ఆరోజుల్లో ఎంతో తపన పడ్డాడట.అయితే సుమంత్ మాత్రం ఆ అవకాశలని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
ఇలా పూరి నీ మూడు సార్లు రిజెక్ట్ చేసిన సుమంత్… ఆ సినిమాలు గాని చేసి ఉంటే ఇప్పటికీ సుమంత్ స్టార్ హీరోగా ఒకం వెలుగు వెలిగేవాడు.కానీ ఏం చేస్తాం టైం బాగోలేకపోతే అరటిపండు తిన్న పన్ను విరుగుతుందని పెద్దలు ఊరికే చెప్పలేదు కదా…
.