హిందీ, బెంగాలీ సినిమాలలో నటించడం ద్వారా విద్యాబాలన్ ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే.విద్యాబాలన్ సినిమాలతో పాటు సీరియళ్లలో కూడా నటించి పాపులారిటీని పెంచుకున్నారు.
కేరళలో జన్మించిన విద్యాబాలన్ ముంబైలో పెరిగారు.హమ్ పాంచ్ అనే హిందీ సీరియల్ ద్వారా నటిగా విద్యాబాలన్ కెరీర్ మొదలైంది.
అయితే విద్యాబాలన్ భర్త సినిమాలలో మాత్రం నటించడం లేదు.
భర్త సినిమాలలో నటించకపోవడం గురించి విద్యాబాలన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ప్రముఖ ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ రాయ్ కపూర్ ను విద్యాబాలన్ పెళ్లి చేసుకున్నారు.ఈ బ్యానర్ లో ఘన్ చక్కర్ అనే సినిమాలో విద్యాబాలన్ నటించగా ఈ సినిమా తర్వాత ఈ బ్యానర్ లో మరో సినిమాలో విద్యాబాలన్ నటించలేదు.
అయితే ఇతర హీరోయిన్లు మాత్రం సొంత బ్యానర్ల సినిమాలలోనే ఎక్కువగా నటిస్తున్నారు.
విద్యాబాలన్ సొంత బ్యానర్ లో నటించి ఆ సినిమా సక్సెస్ సాధిస్తే కళ్లు చెదిరే లాభాలు కూడా సొంతమవుతాయి.అయితే విద్యాబాలన్ మాత్రం తన భర్త బ్యానర్ లో తాను నటించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.ఒకవేళ భర్త బ్యానర్ లో నటించి ఆ సినిమాలు సక్సెస్ సాధిస్తే తన భర్త వల్లే సాధ్యమైందంటూ తన విజయాలను ఎవరైనా తక్కువ చేసి చూపితే తాను తట్టుకోలేనని విద్యాబాలన్ పేర్కొన్నారు.
తాను, తన భర్త ఈ స్టేజ్ కు రావడానికి ఎంతో శ్రమించామని విద్యాబాలన్ వెల్లడించారు.ఒకరి వల్ల మరొకరి సక్సెస్ పై ప్రభావం పడకూడదని ఆమె చెప్పుకొచ్చారు.
విద్యాబాలన్ అసలు విషయం రివీల్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ సైతం సంతోషిస్తున్నారు.భవిష్యత్తులో కూడా తాను భర్త బ్యానర్ లో నటించే ప్రసక్తి లేదని విద్యాబాలన్ తేల్చి చెప్పేయడం గమనార్హం.