టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఇటీవలే ఒక ఇంటివాడు అయిన విషయం తెలిసిందే.అతడు చాలా కాలంగా ప్రేమిస్తున్న అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశాడు.
అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో గత రెండు మూడు రోజులుగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవి తో పాటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఈ వివాహానికి హాజరై వధూ వరులను ఆశీర్వదించారు.
చిరంజీవి అంటే ప్రాణాలు ఇచ్చే హీరో కార్తికేయ వివాహానికి మెగాస్టార్ హాజరవడం చర్చనీయాంశం అయింది.చిరంజీవి ఆశీర్వాదాలు దక్కడంతో కార్తికేయ దంపతులు ఆనందంలో మునిగిపోయారు.
కార్తికేయ కుటుంబ సభ్యులు కూడా మెగాస్టార్ రావడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.తర్వాత రోజు భారీ ఎత్తున రిసెప్షన్ నిర్వహించారు .ఈ పెళ్లి తంతు ముగిసిన తర్వాత నూతన వధూవరుల తో ఇరు కుటుంబాలు కూడా తిరుపతి శ్రీవారి ని దర్శించేందుకు వెళ్లారు.
శ్రీవారి దర్శనం తర్వాత వేదపండితులు శ్రీవారి ఆశీర్వాదాలు అందించి తీర్థ ప్రసాదాలను అందించారు.
కొత్త దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత అక్కడి మీడియా వారికి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మీరు ఇక్కడ చూస్తున్న ఫోటోలు అవే.కార్తికేయ సినిమాల విషయానికి వస్తే ఆర్ ఎక్స్100 సినిమా తో హీరోగా పరిచయమయ్యాడు.
ఆ తర్వాత ఎన్నో వైవిధ్య భరిత సినిమాలను చేశాడు.నాని తో గ్యాంగ్ లీడర్ లో విలన్ గా కూడా నటించాడు.ఇటీవలే రాజావిక్రమార్క సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో త్వరలో అంటే సంక్రాంతికి తమిళంలో రూపొందిన వాలిమై అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఆ సినిమా అజిత్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.
అందులో విలన్ గా కనిపించబోతున్నాడు.వాలిమై తర్వాత ఈయన తమిళంలో సూపర్ స్టార్ గా మారడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.