ఆ విషాద ఘటనపై ప్రధాని ఆవేదన
విదిశ లోని గంజి చోడ గ్రామంలో గురువారం రాత్రి ఒక బాలుడు బావి లో పడ్డాడు.50 అడుగుల లోతున ఈ బావి లో 20 అడుగుల వరకు నీరు ఉంది.బాలుడు పడిపోయిన విషయం తెలిసిన స్థానికులు చుట్టుపక్కల గ్రామాల వారు ఒక్కసారిగా బావి చుట్టూ గుమిగూడారు.దీంతో ఒక్కసారిగా బావి గోడ కూలిపోవడంతో 30 మంది బావి లో పడిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సమయంలో బావి పక్కన ప్రాంతం కూడా కుంగడంతో ఒక ట్రాక్టర్ కూడా బావిలో జరపడంతో మరింత విషాదం నెలకొంది.
సహాయక చర్యలు చేపడుతున్న పోలీస్ సిబ్బంది కూడా నలుగురు బావిలో పడిపోయారు.