ఈ స్టీల్ ఇల్లు చూశారా..? సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు..

ఇల్లు కట్టాలంటే పొడవైన స్థలం కలిగి ఉండటంతో పాటు అధికంగా డబ్బులు ఖర్చు అవుతాయి.సింపుల్ గా ఇల్లు కట్టుకోవాలన్నా సరే రూ.

 Have You Seen This Steel House Easy To Carry Anywhere , Steel House, Latest News-TeluguStop.com

లక్షల్లో డబ్బులు ఖర్చు అవుతుంటాయి.అదీ కూడా కొత్త ఇల్లు( new house ) నిర్మించుకోవాలంటే ఒక ఏడాది సమయం పడుతుంది.

కానీ ఇటీవల అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.తక్కువ సమయంలోనే ఇంటి నిర్మాణం పూర్తవ్వడంతోనే పాటు ఆధునిక సౌకర్యాలతో ఇంటిని మంచి లుక్‌తో మనకు నచ్చినట్లు నిర్మించుకోవచ్చు.

అంతేకాకుండా ఇంటిని ఎక్కడికైనా తీసుకెళ్లేలా లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.

తాజాగా స్టీల్ తో ఇంటిని( steel ) నిర్మించే సరికొత్త టెక్నాలజీ అందుబాటులో వచ్చింది.ఈ ఇంటి నిర్మాణానికి తక్కువ ఖర్చు అవ్వడంతో పాటు మడతేసి ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లి మరీ సెటప్ చేసుకోవచ్చు.ఇటీవల వాషింగ్టన్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీ దీనిని రూపొందించింది.

నాలుగు స్టీల్ గ్రెయిన్ హౌస్‌లను నిర్మించింది.ఈ ఇల్లు పాతకాలపు ధాన్యపు డబ్లాల్లా ఉన్నాయి.

ఈ ఇంటి లోపల బెడ్‌రూమ్, కిచెన్, బాత్ రూమ్ వంటికి ఉన్నాయి.ఎలాంటి వాతావరణ పరిస్థితులను అయినా తట్టుకునేలా ఈ స్టీల్ ఇళ్లను నిర్మించారు.

ఈ ఇంటిలో ఇన్‌బిల్డ్ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.దీంతో ఇంటికి సెక్యూరిటీ పరంగా ఇబ్బంది ఉండదు.

అలాగే ఈ ఇంటిని మడతపెట్టి అవసరం అయినప్పుడు వేరే ప్రాంతానికి కూడా తీసుకెళ్లి అక్కడ సెటప్ చేసుకోవచ్చు.ఈ ఇంటి ధర రూ.13 కోట్లు అవుతుందట.త్వరలో పూర్తి స్థాయిలో ఈ స్టీల్ ఇళ్లను మార్కెట్ లోకి తీసుకురానున్నట్లు ఆ కంపెనీ చెబుతోంది.

భవిష్యత్తులో సిమెంట్ ,ఇసుకతో నిర్మించే ఇల్లు ఉండవని, ఇలాంటి స్టీల్ ఇల్లు ఉంటాయని సదరు కంపెనీ చెబుతోంది.

Steel House Viral Video

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube