సెక్యూరిటీ కోసం మనం డబ్బులు, బంగారం, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో దాచిపెట్టుకుంటూ ఉంటాం.బ్యాంకు లాకర్లలో అయితే సేఫ్‌గా ఉంటుందనే కారణంతో అక్కడ భద్రపరుచుకుంటూ ఉంటాం.
పెద్ద పెద్ద వ్యాపారులు, సంపన్నులు బ్యాంకు లాకర్లలో నగదు, బంగారం, వజ్రాలను( Cash, Gold, Diamonds ) దాచుకుంటూ ఉంటారు.ప్రతీ బ్యాంకులోనూ లాకర్ సదుపాయం ఉంటుంది.
అన్ని బ్రాంచ్‌లలోనూ లాకర్ సౌకర్యాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి.బ్యాంకు లాకర్లలో పెట్టుకుంటే భద్రంగా ఉంటాయని, ఎవరూ చోరీ చేయలేరని అక్కడ దాచుకుంటూ ఉంటారు.
అయితే ప్రపంచదేశాల అన్నింటికీ కలిపి ఒక లాకర్ ఉంది.కానీ ఈ లాకర్ లో నగదు, బంగారం లాంటివి దాచుకోరు.విత్తనాలను ఈ లాకర్ లో భద్రపరుస్తున్నారట.ఈ లాకర్ పేరు డూమ్స్డే వాల్ట్.( Doomsday Vault ) దాదాపు 10 దేశాలు కలిపి ఈ వాల్ట్ ను నిర్వహిస్తున్నాయి.ఏదైనా మహాప్రళయం వచ్చి ప్రపంచం నాశనమైపోతే.
బ్రతికున్నవారు తినడానికి తిండి కోసం ఈ భారీ వాల్ట్‌లో విత్తనాలను దాచిపెడుతున్నారట.ఆర్కిటిక్ సముద్రానికి సమీపంలోని నార్వేలోని స్విట్స్బర్గెన్ ద్వీపంలో( island of Switsbergen in Norway ) ఈ డూమ్డే వాల్ట్ ఉంది.
దీనిని గ్లోబల్ సీడ్ వాల్ట్ అని కూడా పిలుస్తారు.ఆర్కిటిక్ ప్రాంతానికి ఉత్తర ధ్రువానికి అతి సమీపంలో ఇది ఉంది.
అక్కడే ఈ వాల్ట్ ను నిర్మించడానికి ఒక కారణం ఉంది.ఆ ప్రాంతం బాగా చల్లగా ఉంటుంది.దీని వల్ల నిల్వ చేసిన విత్తనాలు పాడైపోకుండా ఉంటాయి.2008లో ఈ డూమ్డ్సే వాల్డ్ ప్రారంభమైంది.100 దేశాలు ఇందులో చేరి సంతకాలు చేశాయి.ఏ దేశమైనా ఇందులో చేరి నిబంధనల ప్రకారం విత్తనాలను డిపాజిట్ చేయవచ్చు.
అయితే ఇందులో డిపాజిట్ చేసిన విత్తనాలను తిరిగి అడగడానికి అవకాశం ఉండదు.దాదాపు 400 అడుగుల లోతుతో దీనిని నిర్మించారు.