కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా తెలంగాణలో కాంగ్రెస్ నేటి నుంచి హాత్ సే హాత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ఈ పాదయాత్ర ప్రారంభంకానుంది.
హాత్ సే హాత్ జోడో యాత్రను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మేడారం నుంచి ప్రారంభించనున్నారు.ముందుగా సమ్మక్క – సారలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.
పాదయాత్రను ప్రారంభించనున్నారు.సాయంత్రం కార్నర్ మీటింగ్ ను ఏర్పాటు చేయనున్నారు.
ఇందులో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ థాక్రే పాల్గొని కీలక సూచనలు చేయనున్నారు.అదేవిధంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు ప్రాంతాల్లో పాదయాత్రలను మొదలు పెట్టనున్నారు.